మహానటిపై క్యూరియాసిటీని పెంచేస్తోంది | Mahanati: Shalini Pandey as Susheela, Malavika Nair as Alamelu | Sakshi
Sakshi News home page

మహానటిపై క్యూరియాసిటీని పెంచేస్తోంది

May 7 2018 2:22 PM | Updated on Mar 21 2024 7:44 PM

సినిమాలోని ఒక్కో పాత్ర గురించి నాని వాయిస్‌ ఓవర్‌ ఇస్తూ ప్రోమో వీడియోలను రిలీజ్‌ చేస్తున్నారు. కేవీ రెడ్డి, ఎల్వీ ప్రసాద్‌, ఎస్వీఆర్‌ ఇలా ప్రతి పాత్ర లుక్‌ ఎలా ఉండబోతోందో ఒక్కొక్కటిగా రివీల్‌ చేశారు.

తాజాగా సావిత్రి జీవితంలో దగ్గరి సంబంధం ఉన్న ఇద్దరి వ్యక్తుల పాత్రలకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. జెమినీ గణేశన్‌ మొదటి భార్య అలమేలు, సావిత్రి చిన్ననాటి స్నేహితురాలు సుశీల పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు... వారి లుక్‌ ఎలా ఉండబోతోందో వీడియో ద్వారా విడుదల చేశారు. అలమేలుగా మాళవికా నాయర్‌, సావిత్రి బాల్య మిత్రురాలిగా షాలినీ పాండే నటిస్తున్నారు. కీర్తి సురేశ్‌, సమంత, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన​, మోహన్‌ బాబు, రాజేంద్ర ప్రసాద్‌ లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన మహానటి మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement