
అవును.. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలో ‘మహానటి’ గెస్ట్‌గా రావడానికి ఒప్పుకున్నారు. సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘మహానటి’ చిత్రంలో మంచి స్థాయిలో కీర్తీ సురేష్ నటించి, ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే. ఈ సంగతి ఇలా ఉంచితే.. తమిళంలో శివ కార్తీకేయన్ హీరోగా పొన్‌రామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సీమరాజా’. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తీ సురేష్ గెస్ట్‌గా నటించనున్నారు.
‘‘సీమరాజా’లో నటించబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు కీర్తీ. హీరోయిన్‌గా కీర్తీ సురేష్ నటించిన ‘మహానటి’ సినిమాలో జర్నలిస్ట్ మధురవాణి క్యారెక్టర్‌లో సమంత నటించారు. ఇప్పుడు సమంత హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలో కీర్తీ గెస్ట్ రోల్ చేయడం విశేషం. అన్నట్లు.. ఇది గెస్ట్ రోల్ అయినప్పటికీ సినిమాకి కీలకం కావడంతో కీర్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.
Comments
Please login to add a commentAdd a comment