
తమిళసినిమా: సంచలన నటుడు శింబు, క్రేజీ నటి కీర్తీసురేశ్. ఈ కొత్త కాంబినేషన్‌లో చిత్రం వస్తే ఎలా ఉంటుంది. సింపుల్ సూపర్‌గా ఉంటుంది కదూ.. అయితే అలాంటి సంచలన కాంబినేషన్‌లో చిత్రం వచ్చే అవకాశం ఉందా అనేగా మీ ప్రశ్న. ఉండే అవకాశం లేకపోలేదు. శింబు, కీర్తీసురేశ్ జంటగా చిత్రం చేయడానికి సన్నాహాలు జరుగుతాన్నాయన్నది తాజా సమాచారం. నటుడు శింబు చిన్న గ్యాప్ తరువాత చిత్రాల విషయంలో స్పీడ్ పెంచాడు. మణిరత్నం దర్శకత్వంలో సెక్క సివంద వానం చిత్రాన్ని పూర్తి చేసిని శింబు తాజాగా వరుసగా మూడు నాలుగు చిత్రాల్లో నటించడానికి సంతకాలు చేసినట్లు సమాచారం. వాటిలో ఒకటి దర్శకుడు వెంకట్‌ప్రభు చిత్రం. దీన్ని సురేశ్ కామాక్షి భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇందులో నటి కీర్తీసురేశ్‌ను నాయకిగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. మహానటి చిత్రం తరువాత ఈ బ్యూటీ క్రేజే వేరు. తెలుగు, తమిళం భాషల్లో పలు అవకాశాలు కీర్తీసురేశ్ తలుపు తడుతున్నాయట. అయితే ఇప్పటి వరకూ ఒక్క చిత్రం కూడా అంగీకరించలేదని కీర్తీనే ఇటీవల స్వయంగా చెప్పింది. ప్రస్తుతం తన విజయ్‌కు జంటగా సర్కార్, విశాల్‌తో సండైక్కోళి 2, విక్రమ్ సరసన సామి స్క్వేర్ చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉంది. ఆ తరువాతే కొత్త చిత్రాలను అంగీకరించనున్నట్లు చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో శింబుతో జతకట్టే అవకా«శం వచ్చిందన్న ప్రచారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. మరి శింబుతో తను ఓకే అంటుందా అన్నది వేచి చూడాలి. ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్, పీసీ.శ్రీరామ్‌లను సంగీతం, ఛాయాగ్రహణం బాధ్యతలకు ఎంపిక చేసే పనిలో చిత్ర దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలిసింది. ఇంతకీ ఈ చిత్ర టైటిల్ ఏమిటన్నది చెప్పలేదు కదూ! అదిరడి. టైటిల్ అదిరింది కదూ! ఈ చిత్రానికి సంబంధించిన అధికార పూర్వక పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment