అనుకున్నవి జరగకపోవడం, ఊహించనివి జరగడం సహజమే. హీరోయిన్ కీర్తి సురేశ్ విషయంలోనూ ఇదే జరుగుతోందనిపిస్తోంది. కోలీవుడ్‌లో కొన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆమె ఆ తరువాత టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మహానటి చిత్రంతో అందరి అభినందనలు అందుకున్న కీర్తిసురేశ్ ఆపై వరుసగా తెలుగు చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఒకటి, రెండు చిత్రాలే చేతిలో ఉండగా ఇప్పుడు మళ్లీ తమిళంలో బిజీ అవుతోంది. జయం రవి సరసన సైరన్, ఉదయనిధి స్టాలిన్‌తో మామన్నన్‌లతో పాటు రఘు తాతా, రివాల్వర్ రీటా చిత్రాల్లో నటిస్తున్న కీర్తిసురేశ్ తాజాగా మరో లక్కీచాన్స్ తలుపు తట్టినట్లు సమాచారం.
కమల్‌హాసన్.. విక్రమ్ చిత్రం విజయం సాధించిన తరువాత ఆయన బిజీగా మారిపోయారు. ఒక పక్క కథానాయకుడిగా నటిస్తూనే మరోపక్క నిర్మాతగా పలు చిత్రాలు నిర్మిస్తున్నారు. ఆయన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నటుడు శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం షూటింగ్ దశలో ఉంది. అదే విధంగా నటుడు ధనుష్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా సంచలన నటుడు శింబు హీరోగా ఒక భారీ చిత్రాన్ని నిర్మించతలపెట్టారు. దీనికి కన్నుమ్ కన్నుమ్ కొల్‌లైయడిత్తాళ్ చిత్రం ఫేమ్ దేసింగు పేరియసామి కథ దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఇందులో జంటగా బాలీవుడ్ సంచల నటి దీపిక పదుకొనేను నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు, అయితే ఆమె అధిక పారితోషికం డిమాండ్ చేసినట్లు ప్రచారం. దీంతో తాజాగా శింబుకు జంటగా కీర్తి సురేశ్‌ను ఎంపిక చేయడానికి చర్యలు జరుగుతున్నట్లు సమాచారం. వీరితో పాటు మరో బాలీవుడ్ నటి కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment