
తమిళసినిమా: కేజీఎఫ్, కేజీఎఫ్ – 2 సినిమాల తరువాత కన్నడ చిత్ర పరిశ్రమలో పేరు మోగుతున్న చిత్ర నిర్మాణ సంస్థ హోంబోలే ఫిల్మ్స్. దక్షిణాది భాషల్లో చిత్ర నిర్మాణం చేపడుతామని అధికారికంగా ప్రకటించిన ఆర్ సంస్థ అధినేత విజయ్ కిరగందర్ ఇప్పటికే టాలీవుడ్‌లో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సలార్ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఇది పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. ఇకపోతే ఈ సంస్థ కోలీవుడ్‌లోనూ చిత్రాలు చేయడానికి సిద్ధమవుతోంది.
ఇప్పటికే సరరై పోట్రు చిత్రం ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో చిత్రం చేయనున్నట్లు ప్రకటించింది. 'ఇందులో నటుడు శింబు కథానాయకుడిగా నటించనున్నట్లు ప్రచారం హోరెత్తింది. తాజాగా ఈ సంస్థలో నటి కీర్తి సురేష్ కథానాయికగా నటించబోతున్నట్లు మరో వార్త ప్రచారంలో ఉంది. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం అని సమాచారం. దీనికి దర్శకుడు ఎవరు..? తదితర వివరాలు ఇంకా వెలువడ లేదు.కాగా ప్రస్తుతం నటి కీర్తి సురేష్ చేతిలో తెలుగులో చిరంజీవికి జంటగా నటిస్తున్న బోలా శంకర్, తమిళంలో జయం రవి సరసన నటిస్తున్న సైరన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయి.
నానితో జత కట్టిన దసరా చిత్రం, తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన నటించిన మామన్నన్ చిత్రాలు షటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రవలు జరుపుకుంటున్నాయి. మరోపక్క కీర్తి సురేష్ నటనకు గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇంకో పక్క ఆమె చిత్రం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వీటన్నిటిపై స్పష్టత రావాలంటే కీర్తి సురేష్ స్పందించాల్సిందే.
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment