![Keerthy Suresh Raghuthatha Glimpse Released - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/21/keerthy-suresh.jpg.webp?itok=VWfgkXyN)
వరుస విజయాలతో మంచి హుషారులో ఉంది హీరోయిన్ కీర్తి సురేశ్. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఈ ఏడాది బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో బోలెడన్ని సినిమాలున్నాయి. అందులో ఒకటి సైరన్.. హీరో జయం రవితో జోడీ కట్టిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఆమె నటించిన మరో చిత్రం రఘుతాత. ఇది లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం. దీన్ని ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మించడం విశేషం. ఇది పిరియాడికల్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రంగా తెరకెక్కుతోంది.
సుమన్‌కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోందని తాజాగా విడుదల చేసిన చిత్ర గ్లింప్స్‌ను చూస్తే తెలుస్తోంది. ఇంతకు ముందు తోపుడు బండ్లు, రిక్షాలలో చిత్రాలను ప్రచారం చేసేవారు. ఈ చిత్ర గ్లింప్స్‌లోనూ.. తోపుడు బండిపై కీర్తి సురేశ్ పోస్టర్ అంటించి ప్రచారం చేస్తున్నట్లు చూపించారు.
నటుడు ఎంఎస్.భాస్కర్, దేవదర్శిని, రవీంద్ర విజయ్, ఆనందసామి, రాజేశ్ బాలకృష్ణన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శాన్ సంగీతాన్ని, యామిని యజ్ఞమూర్తి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాతో కీర్తి సురేశ్ మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి!
చదవండి: పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్.. వారిద్దరిపై నమోదైన కేసు ఇదే
Comments
Please login to add a commentAdd a comment