సాక్షి, చెన్నై: ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు సమాచారం. ఆమె కుటుంబసభ్యులు ఇప్పటికే వరుడిని చూసినట్లు భోగట్టా. ఒక ప్రముఖ బీజేపీ నాయకుడి కుమారుడిని కీర్తి సురేష్ పెళ్లాడబోతుందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో వీరి వివాహానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రముఖ పాత్రికేయుడు, నటుడు ఫూల్‌వాన్ రంగనాథన్ ఒక మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఇంతకీ కీర్తిని పెళ్లాడబోయే ఆ వ్యాపారవేత్త ఎవరు? వివాహం ఎప్పుడు ఉంటుందనేది తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి కీర్తి సురేష్ కుటుంబం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
కాగా దక్షిణాదిలో తనకంటూ గుర్తింపు పొందిన కీర్తి సురేష్ ‘మహానటి’ చిత్రానికి జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. మరోవైపు తెలుగు, తమిళ చిత్రాలతో ఆమె బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు కుకునూర్ నగేశ్ తొలిసారి తెలుగులో తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాఫ్ సినిమాలో ప్రస్తుతం కీర్తి సురేశ్ నటిస్తున్నారు. 'గుడ్ లక్ సఖి' అనే పేరును వస్తున్న ఈ సినిమాలో కీర్తి డీ- గ్లామర్ పాత్రలో కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment