
అలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన ‘మహానటి’ సినిమాలో టైటిల్ రోల్ పోషించి, ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు కథానాయిక కీర్తీసురేశ్. ప్రస్తుతం సౌత్‌లో అగ్ర కథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్న కీర్తీని ‘హీరోయిన్‌గా తన తొలి అవకాశం గురించి ఇటీవల ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. ఆ విషయం గురించి కీర్తి మాట్లాడుతూ – ‘‘నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ ముందు నా స్టడీస్ కంప్లీట్ చేయాలనుకున్నాను. ఇంటర్ తర్వాత నాకిష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అయ్యా. నాలుగేళ్లు చదవాలి. ఓ ప్రోగ్రామ్ కోసం కోర్స్ థర్డ్ ఇయర్‌లో లండన్ వెళ్లాను. ఆ టైమ్‌లో దర్శకుడు ప్రియదర్శన్ ఫోన్ చేశారు.
త్వరగా వచ్చేయ్ సినిమా షూటింగ్ మొదలుపెడతాం అనగానే ఆశ్చర్యపోయాను. కానీ నాకు స్టడీస్ కంప్లీట్ చేయాలని ఉంది. ఆ టైమ్‌లో ఏం చేయాలో పాలుపోలేదు. ఈలోపు ప్రియదర్శన్ గారు నాకు యాక్టింగ్‌పై ఆసక్తి లేదు అనుకున్నట్లున్నారు. లక్కీగా నా ఫైనల్ ఇయర్‌లో ఓ ప్రాజెక్ట్ వర్క్ నిమిత్తం కొంత టైమ్ దొరికింది. ఆ టైమ్‌లోనే నా తొలి మూవీ ‘గీతాంజలి’తో పాటు రెండో సినిమా ‘రింగ్ మాస్టర్’ సినిమాల షూటింగ్‌ను మేనేజ్ చేయడంతో పాటుగా కష్టపడి అనుకున్న టైమ్‌లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి గ్రాడ్యుయేట్ అయ్యా. ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్‌ని అని గర్వంగా చెప్పుకోగలను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు (సురేశ్‌కుమార్) ప్రియదర్శన్‌గారితో తొలి సినిమాను నిర్మించారు. నా తొలి సినిమా ప్రియదర్శన్‌గారి దర్శకత్వంలో రూపొందడం హ్యాపీగా ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment