
సాక్షి, ముంబయి : మహానటి సినిమాకు ప్రేక్షకుల నుంచే కాక విమర్శకులు, సెలబ్రిటీల నుంచీ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాను మహానటి మూవీని చూశానని అద్భుతంగా ఉందని ప్రశంసించారు. కీర్తి సురేష్, సమంత, విజయ్ దేవరకొండల నటన అసామాన్యంగా ఉందంటూ వారిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే సినిమాలో జెమినీ గణేషన్ పాత్ర పోషించిన దుల్కర్ సల్మాన్‌ను రకుల్ ప్రస్తావించకపోవడం ఆయన అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.
మహానటిలో కీలక పాత్రల్లో ఒకటైన జెమినీ గణేషన్ పాత్రలో మెప్పించిన దుల్కర్ సల్మాన్‌ను రకుల్ తన ట్వీట్‌లో విస్మరించడం దుల్కర్ అభిమానులకు రుచించలేదు. తమ అభిమాన నటుడిని ప్రస్తావించకపోవడంతో రకుల్‌ను ట్రోల్ చేస్తూ వారు ట్వీట్లు చేశారు. కాగా, మహానటి మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.