అలనాటి ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కి విజయం సాధించిన మూవీ మహానటి. ఇటీవల విడుదలైన ‘మహానటి’లో నటనకుగానూ కీర్తి సురేష్‌కు నటిగా మంచి మార్కులు పడ్డాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాట భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మహానటి’లోని డిలీటెడ్ సీన్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.