
సౌత్ లో సక్సెస్ అయిన తారలు బాలీవుడ్ వైపు చూడటం సాధరణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్లామర్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ బాలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఈ లిస్ట్‌లో సక్సెస్ అయిన వాళ్లు మాత్రం చాలా తక్కువ. తాజాగా మరో హీరోయిన్ ఈ లిస్ట్‌లో చేరేందుకు రెడీ అవుతోంది.
తెలుగు, తమిళ్‌లో స్టార్ హీరోల సరసన వరుసన సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. మహానటి సినిమా తరువాత కీర్తి ఇమేజ్ తారాస్థాయికి చేరింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోని కపూర్, అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో కీర్తి బాలీవుడ్ ఎంట్రీ దాదాపుగా కన్ఫామ్ అయ్యింది. మరిసౌత్ లో సత్తా చాటిన మహానటి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment