పురట్చి తలైవిగా నటించడానికి రెడీ | Rima Kallingal Ready For Jayalalitha Biopic | Sakshi
Sakshi News home page

పురట్చి తలైవిగా నటించడానికి రెడీ

Published Mon, May 28 2018 8:17 AM | Last Updated on Mon, May 28 2018 8:17 AM

Rima Kallingal Ready For Jayalalitha Biopic - Sakshi

రీమా కళింగళ్‌

తమిళసినిమా: ఇప్పుడు బయోపిక్‌ చిత్రాల కాలం నడుస్తోందని చెప్పవచ్చు. ఆ తరహా చిత్రాలకు ప్రేక్షకులు విశేష ఆదరణను అందించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. ఆ మధ్య క్రికెట్‌ క్రీడాకారుడు ఎంఎస్‌.ధోని జీవిత చరిత్రలో వచ్చిన చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా మహానటి సావిత్రి బయోపిక్‌కు తమిళం, తెలుగు భాషలో సూపర్‌రెస్పాన్స్‌ వస్తోంది. అంతే కాకుండా సావిత్రి పాత్రలో నటించిన యువ నటి కీర్తీసురేశ్‌కు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ప్రస్తుతం సంచలన హిందీ నటుడు సంజయ్‌దత్‌ బయోపిక్, ఎంజీఆర్‌ జీవిత చరిత్ర వంటివి నిర్మాణంలో ఉన్నాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జీవిత చరిత్రను తెరకెక్కించడానికి పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు.

జయలలిత పాత్రలో నటి కీర్తీసురేశ్‌ నటించనుందనే ప్రచారం హల్‌చల్‌ చేసింది. అయితే తాను జయలలిత పాత్రలో నటించడం లేదని, అంతే కాదు ఇకపై ఎవరి బయోపిక్‌లలోనూ నటించనని కీర్తీసురేశ్‌ ఒక భేటీలో స్పష్టం చేసింది. దీంతో సావిత్రి పాత్రలో ఈ బ్యూటీకి లభిస్తున్న అభినందనలు చూసి కొందరు ఇతన నటీమణులు అలాంటి బయోపిక్‌ చిత్రాల్లో నటించాలని ఆశ పడుతున్నారు. అలాంటి వారిలో రీమా కళింగళ్‌ ఒకరు. తమిళంలో భరత్‌కు జంటగా యువన్‌ యువతి చిత్రం ద్వారా పరిచయమైన ఈ కేరళా భామ, మాతృభాషలో ప్రముఖ కథానాయకిగా రాణిస్తోంది. ఆ మధ్య పెళ్లి చేసుకున్న రీమా కళింగళ్‌ తరువాత కూడా నటనను కొనసాగిస్తోంది. కీర్తీసురేశ్‌ మాదిరి ప్రశంసలు పొందడానికి ఎవరి బయోపిక్‌లో నటించాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు తాను తమిళనాడు పురట్చి తలైవి జయలలిత బయోఫిక్‌లో నటించాలని ఆశ పడుతున్నట్లు చెప్పింది. అదే విధంగా 18వ శతాబ్దంలో విప్లవ వీరనారిగా వాసికెక్కిన నంగేలి జీవిత చరిత్రను సినిమాగా రూపొందిస్తే ఆమె పాత్రలో తాను నటిస్తానని రీమా కళంగళ్‌ చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement