Rima Kallingal
-
‘అందులో ఆడవారి తప్పు కూడా ఉంటుంది’
‘డబ్య్లూసీసీ’ (వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్) అవకాశాల పేరుతో ఆడవారిని మోసం చేసేవారికి వ్యతిరేకంగా, బాధితులకు అండగా నిలబడటం కోసం ఏర్పాటు చేసిన సంస్థ. దాదాపు ప్రతి ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు ఇందుకు మద్దతు తెలుపుతుండగా మమతా మోహన్‌దాస్ మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నంగా స్పందించారు. ‘మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే, అందులో స్త్రీలకు కూడా వాటా ఉంటుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ దినపత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో మమతా మహిళల పట్ల వేధింపుల గురించి స్పందిస్తూ ‘ఎవరైనా మన పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నా, లైంగికంగా వేధించిన లేదా అలాంటి పనులు చేయడానికి సిద్ధపడుతున్నారంటే అందులో ఎంతో కొంత మన (ఆడవారి) తప్పు కూడా ఉంటుంది. అంటే ఒకరు మనతో అలా తప్పుగా ప్రవర్తించే అవకాశం స్వయంగా మనమే వారికి ఇచ్చి ఉంటాము. అందుకే వారు ఇలాంటి పనులు చేసే ధైర్యం చేయగలుగుతున్నార’న్నారు. ఆ తర్వాత మమతా వెంటనే తన వ్యాఖ్యలపై స్పష్టతనిస్తూ ‘ఎవరో కొందరినే దృష్టిలో పెట్టుకుని నేను ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. నా మాటలు అందరికి వర్తిస్తాయ’న్నారు. అంతేకాక ‘డబ్య్లూసీసీ గురించి మీ అభిప్రాయం చెప్పండ’ని అడగ్గా ‘అది ఏర్పాటైన సమయంలో నేను ఇక్కడ లేను. నేను ఇందులో భాగస్వామిని అవుతానా అని అడిగితే మాత్రం లేదనే చేప్తాను. ఎందుకంటే డబ్య్లూసీసీ గురించి నాకు ఎటువంటి అభిప్రాయం లేదన్నా’రు. నటీమణులకు ఎదురవుతున్న వేధింపులు గురించి ప్రశ్నించగా.. ‘ఇలాంటి విషయాల గురించి చర్చించాల్సింది వేధింపులు జరిగాక కాదు. అసలు ఇలాంటి సంఘటనలు జరగకముందే వీటి గురించి చర్చించాలి. ఏది ఏమైనా వేధింపులకు గురి చేసిన వారిని మాత్రం వదిలిపెట్టకూడద’న్నారు. అయితే మమతా వ్యాఖ్యలను నటి రీమా కళంగళ్ ఖండించారు. మమతను ఉద్దేశిస్తూ రీమా తన ఫేస్బుక్లో ‘ప్రియమైన మమత మోహన్ దాస్‌కు, నా సోదర సోదరీమణులకు.. మన సమాజం ఎలా తయారయ్యిందంటే వేధింపులు, అత్యాచారాలు, అపహరణ, హింస వంటి నేరాలను చాలా సాధరణంగా పరిగణిస్తుంది. అలాంటి నేరాలకు పాల్పడే వారిని రక్షిస్తోంది. అందుకే తప్పు చేసిన వారు దర్జాగా తిరుగుతున్నారు. బాధితులు మాత్రం అవమానాలను ఎదుర్కొంటున్నారు. కానీ ఈ నేరాలన్నింటికి బాధ్యత వహించాల్సింది నిందుతులు.. బాధితులు ఎంత మాత్రం కాదు. మనకు జరిగిన అన్యాయం గురించి ధైర్యంగా మాట్లాడదాం. ఒకరి కోసం ఒకరం మద్దతుగా నిలుద్దాం. ఇప్పటికైనా నిశ్శబ్దం అనే గోడను బద్దలుకొడదాం’ అంటూ పోస్ట్ చేశారు. -
పురట్చి తలైవిగా నటించడానికి రెడీ
తమిళసినిమా: ఇప్పుడు బయోపిక్ చిత్రాల కాలం నడుస్తోందని చెప్పవచ్చు. ఆ తరహా చిత్రాలకు ప్రేక్షకులు విశేష ఆదరణను అందించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. ఆ మధ్య క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్.ధోని జీవిత చరిత్రలో వచ్చిన చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా మహానటి సావిత్రి బయోపిక్కు తమిళం, తెలుగు భాషలో సూపర్‌రెస్పాన్స్ వస్తోంది. అంతే కాకుండా సావిత్రి పాత్రలో నటించిన యువ నటి కీర్తీసురేశ్‌కు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ప్రస్తుతం సంచలన హిందీ నటుడు సంజయ్‌దత్ బయోపిక్, ఎంజీఆర్ జీవిత చరిత్ర వంటివి నిర్మాణంలో ఉన్నాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జీవిత చరిత్రను తెరకెక్కించడానికి పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. జయలలిత పాత్రలో నటి కీర్తీసురేశ్ నటించనుందనే ప్రచారం హల్చల్ చేసింది. అయితే తాను జయలలిత పాత్రలో నటించడం లేదని, అంతే కాదు ఇకపై ఎవరి బయోపిక్‌లలోనూ నటించనని కీర్తీసురేశ్ ఒక భేటీలో స్పష్టం చేసింది. దీంతో సావిత్రి పాత్రలో ఈ బ్యూటీకి లభిస్తున్న అభినందనలు చూసి కొందరు ఇతన నటీమణులు అలాంటి బయోపిక్ చిత్రాల్లో నటించాలని ఆశ పడుతున్నారు. అలాంటి వారిలో రీమా కళింగళ్ ఒకరు. తమిళంలో భరత్‌కు జంటగా యువన్ యువతి చిత్రం ద్వారా పరిచయమైన ఈ కేరళా భామ, మాతృభాషలో ప్రముఖ కథానాయకిగా రాణిస్తోంది. ఆ మధ్య పెళ్లి చేసుకున్న రీమా కళింగళ్ తరువాత కూడా నటనను కొనసాగిస్తోంది. కీర్తీసురేశ్ మాదిరి ప్రశంసలు పొందడానికి ఎవరి బయోపిక్‌లో నటించాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు తాను తమిళనాడు పురట్చి తలైవి జయలలిత బయోఫిక్‌లో నటించాలని ఆశ పడుతున్నట్లు చెప్పింది. అదే విధంగా 18వ శతాబ్దంలో విప్లవ వీరనారిగా వాసికెక్కిన నంగేలి జీవిత చరిత్రను సినిమాగా రూపొందిస్తే ఆమె పాత్రలో తాను నటిస్తానని రీమా కళంగళ్ చెప్పింది. -
షీలా దీక్షిత్‌పై రీమా సెటైర్
-
షీలా దీక్షిత్‌పై రీమా సెటైర్
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై ప్రముఖ మలయాళ నటి రీమా కళింగళ్ సెటైర్ వేయడం సంచలనం సృష్టిస్తోంది. కేరళ కాంగ్రెస్‌వాదులు ఆమె మీద గుర్రుగా ఉన్నారు. వివరాల్లోకెళితే తమిళంలో ఇవన్ యువతి తదితర చిత్రాల్లో నటించిన కేరళ కుట్టి రీమా కళింగళ్. ఈ బ్యూటీ మలయాళంలో రీతు, హ్యాపీ హజ్బెండ్ కమ్మత్ అండ్ కమ్మత్ చిత్రాల్లో నటించి ప్రముఖ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా, ఢిల్లీ మాజీ సీఎం, కేరళ గవర్నర్‌గా బాధ్యతల్ని చేపట్టనున్న షీలాదీక్షిత్‌పై తన ఫేస్బుక్లో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేసి కలకలం పుట్టిస్తున్నారు. ఆ మధ్య ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ సంఘటనపై షీలాదీక్షిత్ మాట్లాడుతూ స్త్రీలు రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగకుండా రాత్రి ఏడు గంటల్లోపు ఇల్లు చేరుకోవాలని అన్నారు. షీలాదీక్షిత్ మంగళవారం కేరళ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి రీమా కళింగళ్ తన ఫేస్బుక్లో షీలా దీక్షిత్ మన రాష్ట్రానికి గవర్నర్‌గా రానున్నారు కాబట్టి ఇకపై కేరళ స్త్రీలందరూ రాత్రి 7 గంటల్లోపే ఇంటికి చేరుకోండి అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కేరళ రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే రేపాయి. నటి రీమా కళింగళ్ షీలా దీక్షిత్‌ను ఎగతాళి చేస్తున్నారంటూ కేరళ కాంగ్రెస్ వాదులు మండిపడుతున్నారు. అరుునా ఆమె మాత్రం వారి ఆగ్రహాన్ని పట్టించుకో లేదు.