షీలా దీక్షిత్‌పై రీమా సెటైర్
షీలా దీక్షిత్‌పై రీమా సెటైర్
Published Mon, Mar 10 2014 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 4:33 AM
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై ప్రముఖ మలయాళ నటి రీమా కళింగళ్ సెటైర్ వేయడం సంచలనం సృష్టిస్తోంది. కేరళ కాంగ్రెస్‌వాదులు ఆమె మీద గుర్రుగా ఉన్నారు. వివరాల్లోకెళితే తమిళంలో ఇవన్ యువతి తదితర చిత్రాల్లో నటించిన కేరళ కుట్టి రీమా కళింగళ్. ఈ బ్యూటీ మలయాళంలో రీతు, హ్యాపీ హజ్‌బెండ్ కమ్మత్ అండ్ కమ్మత్ చిత్రాల్లో నటించి ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా, ఢిల్లీ మాజీ సీఎం, కేరళ గవర్నర్‌గా బాధ్యతల్ని చేపట్టనున్న షీలాదీక్షిత్‌పై తన ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేసి కలకలం పుట్టిస్తున్నారు. ఆ మధ్య ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది.
ఆ సంఘటనపై షీలాదీక్షిత్ మాట్లాడుతూ స్త్రీలు రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగకుండా రాత్రి ఏడు గంటల్లోపు ఇల్లు చేరుకోవాలని అన్నారు. షీలాదీక్షిత్ మంగళవారం కేరళ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి రీమా కళింగళ్ తన ఫేస్‌బుక్‌లో షీలా దీక్షిత్ మన రాష్ట్రానికి గవర్నర్‌గా రానున్నారు కాబట్టి ఇకపై కేరళ స్త్రీలందరూ రాత్రి 7 గంటల్లోపే ఇంటికి చేరుకోండి అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కేరళ రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే రేపాయి. నటి రీమా కళింగళ్ షీలా దీక్షిత్‌ను ఎగతాళి చేస్తున్నారంటూ కేరళ కాంగ్రెస్ వాదులు మండిపడుతున్నారు. అరుునా ఆమె మాత్రం వారి ఆగ్రహాన్ని పట్టించుకో లేదు.
Advertisement
Advertisement