
ప్రమోషన్స్‌లో ‘మహానటి’ స్టైలే వేరు. సినీ ప్రేక్షకులు రోజూ ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తోంది చిత్రయూనిట్. రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తూ... మహానటి సావిత్రిని గుర్తుచేస్తున్నారు. తాజాగా రిలీజ్‌చేసిన పోస్టర్ కూడా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టర్ ఏ సన్నివేశానికి సంబంధించిందో కూడా ఇట్టే తెలిసిపోతోంది.
మాయాబజార్ సినిమాలో ప్రియదర్శని సీన్ గుర్తండే ఉంటుంది. శశిరేఖ పాత్రలో ఉండే సావిత్రి ప్రియదర్శినిలో చూస్తే అభిమన్యుడి పాత్రలో ఉండే ఏఎన్నార్ కనిపించే సన్నివేశం. ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ కూడా అదే. అయితే మహానటిలో కీర్తి సురేశ్‌కు నాగ చైతన్య కనిపిస్తాడు. దుల్కర్ సల్మాన్, జెమినీ గణేస్ పాత్రలో నటించిన ఈ సినిమాలో సమంత, విజయ్ దేవరకొండలు ముఖ్యపాత్రలో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా స్వప్నా సినిమా, వైజయంతీ మూవీస్ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి. మిక్కి జే మేయర్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
#MahanatiOnMay9th 😊 pic.twitter.com/C62D38ahG6
— Keerthy Suresh (@KeerthyOfficial) May 5, 2018
Comments
Please login to add a commentAdd a comment