
సాక్షి, అమరావతి : 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చిలసౌ’ చిత్రాలకు పలు అవార్డులు దక్కాయి. తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా మహానటి ఎంపికైంది. ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ విభాగంలోనూ మహానటి ఖాతాలో అవార్డులు చేరాయి. ఈ నేపథ్యంలో పురస్కారాలకు ఎంపికైన తెలుగు సినిమా నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని సీఎం ఆకాక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment