
ఆభరణాలు ప్రదర్శిస్తున్న కీర్తిసురేశ్
జయనగర: జయనగరలో మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ సందడి చేశారు. ఏవీఆర్ జ్యువెలర్స్‌ను శాఖ ను ఆదివారం జయనగర నాలుగోబ్లాక్‌లోని డికెన్సన్‌రోడ్డులో ఆమె ప్రారంభించారు. మహారాజుల కాలంనాటి ఆకర్షణీయమైన ఆభరణాలతో పాటు విభిన్న డిజైన్ల నగలు ఉన్నాయని అన్నారు. దక్షిణాదిలో కొన్ని భాషల సినిమాల్లో తాను నటించలేదని, అవకాశం వస్తే నటించడానికి సిద్ధమని ఆమె తెలిపారు. తనను చూడాలని ఇక్కడకు పెద్దసంఖ్యలో విచ్చేసిన అభిమానులను చూస్తే ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఇక్కడ తన అభిమానులు కన్నడభాషలో నటించాలని, త్వరలోనే మంచి అవకాశం లభించాలని కోరుతున్నారని చెప్పారు.