పద్ధతిగా ఉండాలి.. విజయ్‌తో గొడవపై అనసూయ లేటెస్ట్ కామెంట్స్ | Anasuya Comments Vijay Devarakonda Issue Simmba Trailer Event | Sakshi
Sakshi News home page

Anasuya Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండతో వివాదం.. అనసూయ మరోసారి

Published Wed, Jul 24 2024 3:10 PM | Last Updated on Wed, Jul 24 2024 3:36 PM

Anasuya Comments Vijay Devarakonda Issue Simmba Trailer Event

యాంకర్ అనసూయ.. ఈ పేరు చెప్పగానే ఆమె అందంతో పాటు చిన్న చిన్న వివాదాలు కూడా గుర్తొస్తాయి. 'అర్జున్ రెడ్డి' రిలీజ్ టైంలో విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్, మూవీ కంటెంట్‌పై అనసూయ కొన్ని కామెంట్స్ చేసింది. అప్పటినుంచి విజయ్-అనసూయ పరోక్షంగా చిన్నపాటి గొడవ నడుస్తూ వచ్చింది. కొన్నిరోజుల క్రితమే దీనికి పుల్‌స్టాప్ అని చెప్పింది. తాజాగా మరోసారి ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్)

'నేను దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. సినిమాలతో ఎలాగైతే మెసేజ్ ఇస్తారో నేను కూడా అలానే ఇవ్వాలని అప్పుడు రియాక్ట్ అయ్యాను. స్టేజీ మేనర్స్ గురించే ఆ రోజు మాట్లాడాను. లైమ్ లైట్‌లో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలి. అది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. కొన్నిసార్లు మితిమీరినప్పుడు అందరికీ అర్థమవుతుంటాయ్. ఆ రోజు మీరెవరూ మాట్లాడకపోవడంతో నేను మాట్లాడాల్సి వచ్చింది. మీడియా ప్రశ్నించలేదు. మళ్లీ తప్పు ఎత్తి చూపినందుకు నన్నే అన్నారు. ఎవరిపైనా నాకు ద్వేషం లేదు' అని అనసూయ క్లారిటీ ఇచ్చేసింది.

అనసూయ నటించిన లేటెస్ట్ మూవీ 'సింబా'. తాజాగా ట్రైలర్ రిలీజైంది. ఇందులోనే ఓ సీన్‌లో భాగంగా విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడని చెప్పగానే అనసూయ పాత్ర సిగ్గుపడుతుంది. ఈ సీన్ చూసిన తర్వాత మీడియా.. విజయ్ దేవరకొండతో గొడవపై ప్రశ్నించింది. అనసూయ కూడా ఇక దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదని చెబుతూ స్పష్టత ఇచ్చేసింది.

(ఇదీ చదవండి: Kill Movie Review: 'కిల్' సినిమా రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement