విజయ్‌ సింపతీ డైలాగులు.. నేనూ తెలంగాణ బిడ్డనే అన్న అనసూయ | Anasuya Bharadwaj Reply Ton Who mentioned Her name In Tweet aunty | Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: 'ఎందుకైనా మంచిది.. ఒకసారి ఇంట్లో అడగండి'..నెటిజన్‌కు అనసూయ కౌంటర్!

Published Thu, Apr 4 2024 6:42 PM | Last Updated on Thu, Apr 4 2024 7:27 PM

Anasuya Bharadwaj Reply Ton Who mentioned Her name In Tweet aunty - Sakshi

గతేడాది విమానం చిత్రంతో అలరించిన అనసూయ.. ప్రస్తుతం అల్లు అర్జున్‌ పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన అనసూయ టాలీవుడ్‌లో స్టార్‌ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. రంగస్థలం, పుష్ప చిత్రాలు ఆమె కెరీర్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి.  అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ముద్దుగుమ్మ.. అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌కు అనసూయ తనదైన స్టైల్‌లో స్పందించింది. మీకు, నాకు ఎలాంటి రిలేషన్‌ లేదంటూనే కాస్తా వ్యంగ్యంగానే ఇచ్చిపడేసింది. ఇంతకీ అసలేం జరిగింది? అనసూయ ఎందుకు రియాక్ట్‌ అయిందో మీరు కూడా చూసేయండి. 

అనసూయ తన ట్వీట్‌లో రాస్తూ.. 'ఎందుకు కార్తీక్ అస్తమానం నన్ను లాగుతారు. ఎవరు ఏం మాఫియా చేస్తున్నారో నేను ఎప్పుడో చెప్పి చెప్పి వదిలేశాను. అనవసరంగా నేనే హైప్ ఇస్తున్నానని మా వాళ్లు అంటుంటే నిజమేనేమో అని వదిలేశాను. నేను కూడా తెలంగాణ బిడ్డనే. కానీ నాకు సింపతి అక్కర్లేదు. నాకు నా మీద నమ్మకం. నా దేవుడి మీద నమ్మకం. మా అమ్మ, నాన్నలు నాకిచ్చిన విలువలు, పెంపకం నన్ను నా దృష్టిలో ఎప్పుడు దిగజారనివ్వవు. ఇప్పుడు ఈ ట్వీట్‌ను కూడా తమ స్వార్థానికి వాడుకున్న నేను ఆశ్చర్యపోను. కానీ నాకు, వాళ్లకి ఎటువంటి సంబంధం అప్పుడు లేదు.. ఇప్పుడు లేదు.. అన్నట్లు నాకు తెలిసి మీరు, నేను చుట్టాలం అస్సలు కాదండి. సో నేను నీకు ఆంటీ కానేమో.. అయినా ఒకసారి మీ ఇంట్లో అడగండి. మీకు తెలియకుండా ఏమైనా రిలేషన్స్‌ ఉన్నాయోమో?.. ఎందుకంటే నాకు చుట్టాలైతేనే ఆ పలకరింపులు ఉంటాయని మా పెద్దలు నేర్పించారు. ఏదేమైనా మీరు అంతా మంచే జరగాలి అండి.' అంటూ పోస్ట్ చేసింది. 

అసలేం జరిగిందేంటే..

తాజాగా ఓ నెటిజన్ విజయ్ దేవరకొండను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో అనసూయను ఆంటీ అని ప్రస్తావించాడు. ఇది చూసిన అనసూయ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

అనసూయ, విజయ్ ఫ్యాన్స్‌కు కోల్డ్ వార్

కాగా.. గతంలో సోషల్‌ మీడియాలో విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌కి తనకు మధ్య జరిగిన ట్విటర్‌ వార్‌పై కూడా  అనసూయ భరద్వాజ్‌ స్పందించింది.  విజయ్‌ దేవరకొండ డబ్బులిచ్చి మరి నన్ను తిట్టించాడని తెలిసి చాలా బాధ పడ్డానని ఆమె పేర్కొంది. గతంలో విమానం సినిమా సక్సెస్‌ మీట్‌లో మాట్లాడుతూ.. నాకు పీఆర్‌ టీమ్‌ లేదు. ఏదైనా నేనే మాట్లాడుతా.. ట్వీట్స్‌ కూడా నేనే చేశా. కానీ ఇకపై ఈ వివాదానికి దూరంగా ఉండాలనుకుంటున్నా.. అని అనసూయ చెప్పుకొచ్చింది. కాగా.. గతంలోనే అనసూయ, విజయ్‌ ఫ్యాన్స్ మధ్య కోల్డ్‌ వార్‌ జరిగిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement