Anchor Anasuya Sensational Tweet About Anand Deverakonda Baby Telugu Movie - Sakshi
Sakshi News home page

Baby Movie -Anchor Anasuya: 'బేబి' సినిమాపై అనసూయ కామెంట్స్

Published Mon, Jul 10 2023 5:30 PM | Last Updated on Mon, Jul 10 2023 5:40 PM

Anchor Anasuya Tweet Baby Movie Telugu - Sakshi

తెలుగు యాంకర్స్‌లో అనసూయ సమ్‌థింగ్ డిఫరెంట్. ఎందుకంటే టీవీ స్క్రీన్ పై సక్సెస్ అయినోళ్లు సినిమా స్క్రీన్ పై సక్సెస్ అయింది చాలా తక్కువ. కానీ ఈ కామెంట్ ని బ్రేక్ చేసిన వాళ్లలో అనసూయ ఉంటుంది. కామెడీ షో యాంకర్‌గా పేరు తెచ్చుకుని.. ఇప్పుడు సినిమాల్లో లీడ్, విలన్ తరహా రోల్స్ చేస్తోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కాంట్రవర్సీకి కేరాఫ్ అవుతుంటుంది. 

సినిమాలతో బిజీ
న్యూస్ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ.. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్నాచితకా పాత‍్రలు చేసింది. పెద్దగా పేరు రాలేదు. దీంతో మళ్లీ టీవీల్లోకి వచ్చేసింది. 'జబర్దస్త్' కామెడీ షోలో గ్లామర్ చూపించి, చాలా క్రేజ్ సంపాదించింది. అలా 'రంగస్థలం', 'పుష్ప', 'క్షణం' సినిమాల్లో ఛాన్సులు కొట్టేసి, అద్భుతంగా నటించింది. ప్రస్తుతం 'పుష్ప 2'తో బిజీగా ఉంది.

(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిన సామ్.. ఆ ఆరు నెలలు!)

విజయ్‌తో గొడవ?
యాక్టింగ్, గ్లామర్ పరంగా అనసూయని వంక పెట్టడానికి ఏముండదు. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం అప్పుడప్పుడు న్యూస్ అవుతూ ఉంటుంది. గతంలో 'అర్జున్ రెడ్డి' విడుదల సమయంలో ఈమె పలు కామెంట్స్ చేసింది. అప్పటినుంచి హీరో విజయ్ దేవరకొండపై ఏదో ఓ సందర్భంలో టీజ్ చేస్తూనే ఉంటుంది. కాకపోతే అది పరోక్షంగానే ఉంటుంది.

ఆనంద్‌కి విషెస్
విజయ్ దేవరకొండ గతంలో డబ్బులిచ్చి మరీ తనని ట్రోల్ చేయించాడని అనసూయ.. కొన్నాళ్ల ముందు చెప్పుకొచ్చింది. ఇలా రౌడీహీరోతో ఈమె వివాదం నడుస్తూనే ఉంది. ఇప్పుడు అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'బేబి' సినిమాకి మాత్రం అనసూయ ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఇది తనకు తెలిసిన వాళ్ల కథలా ఉందని ట్వీట్ చేసింది. దీంతో అనసూయ పోస్ట్ కాస్త వైరల్‌గా మారిపోయింది.

(ఇదీ చదవండి: తమన్నా మాస్ స్టెప్పులు.. అలా పోల్చిన విజయ్ వర్మ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement