![Anasuya Bhardwaj Gives Clarity About Issue Vijay Devarakonda Fans - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/10/anasuya-bharadwaj.jpg.webp?itok=YtHUPdm0)
సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి తనకు మధ్య జరిగిన ట్విటర్ వార్‌పై యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ స్పందించింది. విజయ్ దేవరకొండ డబ్బులిచ్చి మరి నన్ను తిట్టించాడని తెలిసి చాలా బాధ పడ్డానని ఆమె పేర్కొంది. తాజాగా ‘విమానం’ సినిమా సక్సెస్ మీట్‌లో పాల్గొన్న అనసూయకు .. ‘విజయ్ ఫ్యాన్స్‌తో ట్విటర్ వార్ ఇకపై ఆపేస్తారని చెప్పారట నిజమేనా? అనే ప్రశ్న ఎదురైంది.
(చదవండి: వరుణ్‌తో నిశ్చితార్థం, లావణ్య త్రిపాఠి చీర ధరెంతో తెలుసా?)
దీనికి అనసూయ సమాధానం ఇస్తూ.. ‘నిజమే. ఇకపై విజయ్ ఫ్యాన్స్‌తో గొడవపడొద్దని డిసైడ్ అయ్యాను. మానసిక ప్రశాంతత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాడు. డబ్బులిచ్చి నన్ను తిట్టించారనే విషయం తెలిసి చాలా బాధపడ్డాను. అతనితో(విజయ్ దేవరకొండ) ఫోన్ కాల్ మాట్లాడడానికి ట్రై చేశా.. కానీ స్పందించలేదు. నాకు పీఆర్ టీమ్ లేదు. ఏదైనా నేనే మాట్లాడుతా. ట్వీట్స్ కూడా నేనే చేశా. కానీ ఇకపై ఈ వివాదానికి దూరంగా ఉండాలనుకుంటున్నాను’ అని అనసూయ చెప్పుకొచ్చింది.
అనసూయ విజయ్‌ల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అనసూయ తరచూ విజయ్‌పై పరోక్షంగా ట్వీట్స్ చేస్తుంటారు. ఇటీవల విజయ్ నటించిన ఖుషీ పోస్టర్‌పై ‘ది విజయ్ దేవరకొండ’అని ఉండటాన్ని తప్పుబడుతూ ఆమె వరుస ట్వీట్స్ చేసింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ అనసూయను ట్రోల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment