అర్జున్ రెడ్డి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన తెలుగు సినిమా అది. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో వివాదాలు సృష్టించటంతో పాటు అదే స్థాయిలో విజయం కూడా సాధించింది. ప్రేమకథను ఇంత బోల్డుగా చూపించొచ్చా అనేలా అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ అయిపోయాడు. ఇక అర్జున్ రెడ్డికి ఫిదా అయిన బాలీవుడ్.. సందీప్‌రెడ్డిని అక్కడికి తీసుకెళ్లింది. అక్కడ షాహిద్ కపూర్‌తో కబీర్ సింగ్‌గా తెరకెక్కించి కనక వర్షాన్ని కురిపించాడు. ఇక అర్జున్ రెడ్డి విడుదలై సరిగ్గా మూడేళ్లవుతుంది(ఆగస్ట్ 25 నాటికి).
(చదవండి : ‘చిల్లింగ్ విత్ బాయ్స్’ అంటున్న విజయ్ దేవరకొండ)
ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమా 4.20 నిమిషాల నిడివితో ఉండేలా తెరకెక్కించామని, తప్పనిసరి పరిస్థితిల్లో కొన్ని కొన్ని సీన్లను తొలగించాల్సి వచ్చిందన్నారు. ఫైనల్‌గా 3.45 నిమిషాల నిడివి గల సినిమాను రెడీ చేసుకున్నామని చెప్పారు. కానీ, కొన్ని కారణాల వల్ల చివరికి 3.06గంటల నిడివి ఉన్న సీనిమాను మాత్రమే విడుదల చేశామని చెప్పారు. 3.45గంటల నిడివితో విడుదల చేస్తే మరింత హిట్ సాధించేదని చెప్పుకొచ్చారు.
కట్ చేసిన సీన్లతో మొత్తం 3.45 నిమిషాల నిడివి గల సినిమాను ఐదేళ్లు పూర్తయ్యే సందర్భంగా 2022 ఆగస్ట్ 25న విడుద చేయాలని ప్లాన్ చేసుకున్నామని సందీప్ రెడ్డి తెలిపారు. అందులో చాలా ఫన్నీ సీన్లు కూడా ఉన్నాయట. శివ, కమల్, విద్య, కీర్తి ఎలా క్లోజ్ అయ్యారు, అర్జున్ రెడ్డి స్కూల్ ప్రెండ్స్.. అతని బాల్యం, బుల్లెట్ బైక్ సంబంధించిన సీన్లు కొత్తగా విడుదల చేయబోయే సినిమాలో ఉంటాయట. అలాగే అర్జున్ రెడ్డి పెంచుకున్న కుక్కకు సంబంధించిన కామెడీ సీన్ కూడా ఉండబోతుదంట. మళ్లీ ఈ సినిమా ఏ రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి మరి.
కొత్త సీన్లతో మళ్లీ అర్జున్ రెడ్డి!
Published Wed, Aug 26 2020 12:01 PM | Last Updated on Wed, Aug 26 2020 1:58 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment