sandeep reddy
-
మహేష్ బాబుతో సినిమా క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
-
మహేశ్ బాబుతో సినిమా తీసే సమయం లేదు: సందీప్‌రెడ్డి వంగా
రాజానగరం: ప్రముఖ సినీ హీరో ప్రభాస్‌తో త్వరలోనే స్పిరిట్ సినిమా ప్రారంభమవుతుందని సినీ దర్శకుడు సందీప్‌రెడ్డి స్పష్టం చేశారు. అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్, యానిమల్ చిత్రాలు తీసి హిట్ కొట్టి ఫామ్‌లో ఉన్న ఆయన స్థానిక జీఎస్ఎల్ వైద్య కళాశాల ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన స్వతంత్య్ర ఆసుపత్రి 38వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో ‘సాక్షి’ ముచ్చడించింది. ఆ వివరాలు ఇలా.. మీరు తీసే సినిమాల్లో వైద్యానికి సంబంధించి అంశాలే ఎక్కువగా ఉంటున్నాయి. దానికి కారణాలేంటి?సందీప్‌రెడ్డి: ఫిజియోథెరపీ కోర్సు చేసిన నేను కొంతకాలం ప్రాక్టీస్ కూడా చేశాను. అందువల్ల ఆ ఛాయలు సినిమాల్లో కాస్త డీప్‌గా కనిపిస్తుంటాయి. వైద్య రంగంలో ఉన్న మీరు సినిమా రంగం వైపు ఎందుకు వెళ్లారు?సందీప్‌రెడ్డి: విద్యార్థి దశ నుంచి ఎందుకో సినిమాలపై ఎక్కువగా ఆసక్తి ఉండేది. సినిమా తీసే విధానాన్ని నిశితంగా పరిశీలించే వాడిని. అందుకే ఫిజియోథెరపిస్టుగా ప్రాక్టీసు చేసే సమయంలోనే సినీ రంగం వైపు అడుగులు పడ్డాయి. తదుపరి సినిమాల గురించి చెబుతారా..!సందీప్‌రెడ్డి: ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది. మహేష్‌బాబుతో సినిమా అన్నారు, ఎప్పుడు చేస్తారు?సందీప్‌రెడ్డి: ప్రస్తుతం అందుకు సమయం లేదు. స్పిరిట్ సినిమా తరువాత యానిమల్– 2కి వెళ్తాం. ఈ రెండింటికీ కనీసం నాలుగేళ్లు పడుతుంది. ఆ తరువాతే ఏదైనా ఉంటుంది. వైద్య విద్యార్థులకు మీరిచ్చే సందేశం ఏంటి?సందీప్‌రెడ్డి: సినిమాల ద్వారానే నా సందేశం ఏంటో చెబుతూనే ఉన్నాను. ఏదేమైనా చేసే పనిపై ఫోకస్ పెట్టాలి. అప్పుడే సరైన ఫలితాలను అందుకోగలుగుతాం. -
స్వాతంత్య్రం రాక ముందు...రజాకార్ నేపథ్యంలో ప్రభాస్ చిత్రం
ఇప్పటికే ‘సలార్ 2’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు అంగీకరించిన ప్రభాస్ తదుపరి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చేయనున్నారు. అరవై శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, డిసెంబరులో షూటింగ్ ఆరంభిస్తామని సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇక తాజాగా ప్రభాస్ సైన్ చేసిన మరో సినిమా ప్రకటన వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ మూవీ అని మేకర్స్ పేర్కొన్నారు. కాగా స్వాతంత్య్రం రాక పూర్వం రజాకార్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. చిత్రసంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ నేతృత్వంలో ఇప్పటికే మూడు పాటలు కంపోజ్ చేశామని దర్శకుడు హను తెలిపారు. -
మంత్రి, జెడ్పీ చైర్మన్ మధ్య మాటల యుద్ధం
బీబీనగర్: గ్రామ పంచాయతీ భవన ప్రారంభో త్సవం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి జెడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డిల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. సోమ వారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు గ్రామపంచా యతీ భవన ప్రారంబోత్సవ అనంతరం నిర్వ హించిన సమావేశంలో సందీప్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వారంలోపే రైతు భరోసాతో పాటు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఇవ్వలేదని, రైతుబంధు రాలేదని ఎవరైనా అడిగితే చెప్పుతో కొడ తాం అనడం సరికాదని, రైతుబంధు ఇచ్చింది మేమే అని అనడంతో వెంటనే కాంగ్రెస్ నాయకులు జెడ్పీ చైర్మన్‌తో వాగ్వాదం చేశారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకొని.. సందీప్‌రెడ్డి చిన్న పిల్లగాడు, అతనికి ఏమీ తెలియదని, తెలియక మాట్లాడుతున్నాడని అనడంతో సందీప్‌రెడ్డి జోక్యం చేసుకొని.. తాను అన్నీ తెలిసే మాట్లాడుతున్నానని అనడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన మంత్రి.. ‘వీన్ని ఎత్తి బయటపడేయండి’అని అనడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజీ మీదకు దూసుకొచ్చారు. సందీన్రెడ్డి డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సందీప్‌రెడ్డిని స్టేజీపై నుంచి వెళ్లిపోవాలని డీసీపీ, ఏసీపీ చెప్పగా తాను ఎందుకు వెళ్లాలి అంటూ జెడ్పీ చైర్మన్ పోలీసులను ప్రశ్నించారు. దీంతో మంత్రి మరింత ఆగ్రహంతో ‘వార్డు మెంబర్‌గా కూడా గెలవలేవు.. ఏదో నీ తండ్రి మాధవరెడ్డి పేరుతో పదవి వచ్చింది తప్ప నీలో ఏమీలేదు. నీ సొంత గ్రామానికి రోడ్డు వేయించలేకపోయావు బచ్చా’అని అన్నారు. పోలీసులు సందీప్‌రెడ్డిని స్టేజీ కిందకు తీసుకుపోతున్న సమయంలో ఒకరిద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు వెనుక నుంచి ఆయనను పిడుగుద్దులు గుద్దారు. సభాస్థలి నుంచి కొద్ది దూరం వెళ్లిన తర్వాత సందీప్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పలేక మంత్రి కోమటిరెడ్డి తనపై దాడి చేయించారని చెప్పారు. -
బాక్సాఫీస్ వేటలో యానిమల్ బ్లాక్ బస్టర్
బాక్సాఫీస్ వద్ద ‘యానిమల్’ వసూళ్ల వేట కొనసాగుతోంది. తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తోనే సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆ తర్వాత హిందీ పరిశ్రమ వైపు వెళ్లారు. అక్కడ ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్నే ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసి, మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ రెండు చిత్రాలు ఒక ఎత్తయితే సందీప్ తెరకెక్కించిన మూడో చిత్రం ‘యానిమల్’ వసూళ్ల పరంగా మరో ఎత్తు అనాలి. రణ్‌బీర్ కపూర్ కథానాయకునిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలై, సంచలన వసూళ్లతో దూసుకెళుతోంది. విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 116 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక తొలి వారాంతానికి రూ. 356 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా 16 రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ. 817.36 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రణ్‌బీర్ కపూర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించే దిశగా ఈ చిత్రం దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ సాధించిన వసూళ్ల ప్రకారం ఈ ఏడాది విడుదలై, అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల్లో ‘యానిమల్’ టాప్ ఫైవ్‌లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్ ’, ‘పఠాన్ ’ చిత్రాలు రూ. వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టి మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక ‘యానిమల్’ చిత్రం తెలుగులోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. తెలుగు అనువాదాన్ని ‘దిల్’ రాజు విడుదల చేశారు. రిలీజ్ అయిన తొలి రోజే రూ. 15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని ‘దిల్’ రాజు పేర్కొన్నారు. తెలుగు వెర్షన్ ఇప్పటివరకూ దాదాపు రూ. 60 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఇలా ఈ ఏడాది సందీప్ రెడ్డి బాక్సాఫీస్‌ని షేక్ చేసే చిత్రం తీశారు. ఈ చిత్రానికి ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా ఓ నిర్మాత. రష్మికా మందన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రి కీలక పాత్రలు పోషించారు. ‘యానిమల్’కి రెండో భాగం ‘యానిమల్ పార్క్’ రానున్న సంగతి తెలిసిందే. -
యానిమల్ మూవీ నటి.. నక్క తోక తొక్కినట్టుందే!
రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన చిత్రం యానిమల్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు రూ.500 కోట్ల చేరువలో కలెక్షన్స్ సాధించింది. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సూపర్ హిట్ డైరెక్టర్ టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్‌ను కూడా ప్రకటించారు సందీప్. దీంతో ఈ చిత్రంలో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఎవరు కనిపించనున్నారనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే యానిమల్ చిత్రంతో ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ భామ రెబల్ స్టార్‌తో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే యానిమల్ చిత్రం ద్వారా రష్మిక కంటే ఎక్కువగా బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రికే పాపులారిటీ దక్కింది. రణ్‌బీర్ కపూర్‌తో ఫుల్ రొమాంటిక్ సన్నివేశాల్లో మెప్పించింది. అంతే రణ్‌బీర్‌తో కెమిస్ట్రీ అదుర్స్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. మరో నేషనల్ క్రష్ త్రిప్తి డిమ్రి అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. యానిమల్ చిత్రంలో జోయా పాత్రలో కనిపించిన త్రిప్తి డిమ్రిపైనే ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. ఆమె ఫర్ఫామెన్స్‌కు సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో సందీప్ రెడ్డి భారీ బడ్జెట్ చిత్రంలో ఆఫర్ దక్కించుకుందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన అంటే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్‌తో నటించే ఛాన్స్ కొట్టేసిందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే స్పిరిట్‌లో ఆమె పాత్రపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. హీరోయిన్గా లేదా యానిమల్ చిత్రంలానే అనే విషయం తెలియాల్సి ఉంది. దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కాగా.. దాదాపు రూ400 కోట్ల భారీ బడ్జెట్‌తో స్పిరిట్ తెరకెక్కించునున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ నెలలోనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ నటించిన సలార్ రిలీజ్ కానుంది. డిసెంబర్ 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
ప్రభాస్‌తో సినిమా.. రన్ టైమ్ ఎంతో చెప్పేసిన సందీప్ రెడ్డి వంగా
సందీప్ రెడ్డి వంగా.. ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ డైరెక్టర్ జాబితాలో ఆయన ఎప్పుడో చేరిపోయాడు.. ఇప్పటి వరకు ఆయన చేసిన చిత్రాలు కేవలం రెండు మాత్రమే.. అర్జున్ రెడ్డి, యానిమల్. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్‌తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు సందీప్. ఇప్పుడు యానిమల్తో డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కానీ ఆయన డైరెక్ట్ చేసిన రెండు చిత్రాల రన్ టైమ్ 3 గంటలకు పైగానే ఉంటుంది. ఇంత నిడివి ఉన్న సినిమాను ఈ కాలం ఆడియన్స్ భరించగలరా అనే ప్రశ్నకు సందీప్ చెప్పిన సమాదానం ఇదే.. కథ బాగుంటే సినిమాకు భారీ రన్ టైమ్ పెద్ద ఇబ్బంది కాదు. అర్జున్ రెడ్డి 3 గంటల 6 నిమిషాలుంది. అది ఒక అమ్మాయి అబ్బాయి కథే. యానిమల్‌లో ఒక కుటుంబం, ప్రత్యర్ధులు ఇలా చాలా లేయర్స్ ఉన్నాయి. అర్జున్ రెడ్డి కంటే కేవలం 15 నిమిషాలే ఎక్కువ రన్ టైమ్ ఉందని చెప్పిన సందీప్ రెడ్డి.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సందీప్ కూడా ఒక సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ సినిమా రన్ టైమ్ ఎంత ఉంటుందో రివీల్ చేశాడు సందీప్. దీనికి స్పిరిట్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభం అవుతుందని సందీప్ తెలిపాడు. ఇప్పటికే కథ దాదాపు పూర్తి అయిందని తాజా ఇంటర్వ్యూలో చెప్పిన సందీప్.. ఈ సినిమా రన్ టైమ్ సుమారుగా 3 గంటలు ఉంటుందని ఆయన ప్రకటించాడు. ఒకవేళ కథలో మార్పులు జరిగితే మాత్రం 2:45 గంటలు ఉండవచ్చని చెప్పాడు. ప్రభాస్‌తో తీస్తున్న సినిమాపై ఎవరెన్నీ భారీ అంచనాలు పెట్టుకున్న ఎలాంటి ఇబ్బందిలేదని, అందుకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని సందీప్ చెప్పడం విశేషం. 2024లో ప్రారంభం చేసి 2025లో ప్రభాస్ సినిమా విడుదల కావచ్చని చెప్పాడు. -
ప్రేమ కాదు.. పగ అనేది బలమైన భావోద్వేగం
‘‘ప్రేమ, కోపం కాదు..పగ తీర్చుకోవడమే బలమైన భావోద్వేగమని ‘యానిమల్’ సినిమా ప్రయాణంలో నాకు అనిపించింది. మనతో పగను ముందుకు తీసుకువెళ్లడం అనేది చిన్న విషయం కాదు. నేను ఎందుకు ఇలా చెబుతున్నానో ‘యానిమల్’ సినిమా చూస్తే ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. రణ్‌బీర్ కపూర్, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా, అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘యానిమల్’. తెలుగు, తమిళం, కన్నడం,మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం డిసెంబరు 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా సందీప్‌రెడ్డి వంగా చెప్పిన విశేషాలు... ► తండ్రీకొడుకుల భావోద్వేగమే ‘యానిమల్’ సినిమా ప్రధానాంశం. ఓ వ్యక్తి తన భావోద్వేగంతో కుటుంబం కోసం ఎంతదూరం వెళ్లాడు? అన్నదే ఈ సినిమా. ఈ సినిమాలో హింసాత్మక సన్నివేశాలను, భావోద్వేగ సన్నివేశాలను బ్యాలెన్స్ చేశాననే అనుకుంటున్నాను. ► ‘యానిమల్’ కథను తొలిసారిగా విన్నప్పుడు కొంతమంది యాక్టర్స్‌కు కొన్ని అంశాలు నచ్చలేదనే చర్చ జరిగి ఉండొచ్చు. అయితే ‘యానిమల్’ కథ రణ్‌బీర్ కపూర్‌కు నచ్చింది. పైగా నాకు బాగా నచ్చిన నటుడు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి రణ్‌బీర్ కపూర్. ► ఈ సినిమా లవ్‌స్టోరీతోనే మొదలవుతుంది. ఈ సినిమాలో హీరో పాత్రను అతని తల్లిదండ్రులు కన్నా ఎక్కువగా అర్థం చేసుకున్నది హీరోయిన్ పాత్రే అని సినిమా చూసినప్పుడు ప్రేక్షకులకు అనిపిస్తుంది. కథలో రష్మికా మందన్నా, అనిల్‌కపూర్ పాత్రలు చాలా కీలకంగా ఉంటాయి. బాబీ డియోల్‌ది విలన్ రోల్. ఆయన పాత్ర గురించి నేను ఇప్పుడే చెప్పలేను. ప్రేక్షకులు థియేటర్స్‌లో చూడాలి. నిర్మాత భూషణ్కుమార్గారు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. నా సొంత సోదరుడు ప్రణయ్ ్రపోడక్షన్ లో ఉండటం నాకు ప్లస్గానే అనిపించింది. నా సినిమా నాకంటే ఎక్కువగా మరొకరికి అర్థం కాదేమోనని నా సినిమాలకు నేనే ఎడిటింగ్ చేసుకుంటున్నాను. అలా ‘యానిమల్’ సినిమాకు ఎడిటింగ్ చేశాను. ► అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా అంటే స్టోరీ, క్యారెక్టర్స్‌లో ఇంటెన్స్ తగ్గిపోవచ్చు. సినిమాకు ‘ఏ’ సర్టిఫికేట్ వచ్చింది. ఇది చిన్నపాటి మైనస్ అనుకుంటున్నాను. అయితే ‘యానిమల్’ నిడివి మూడుగంటల ఇరవై నిమిషాలు ఉండటం అనేది పెద్ద సమస్య కాదని నేను అనుకుంటున్నాను. ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమకథలా వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా మూడుగంటల ఆరు నిమిషాలైనా ప్రేక్షకులు ఆదరించారు. ‘యానిమల్’ సినిమాలో ప్రేమకథే కాదు.. కుటుంబ అంశాలను ప్రస్తావించాము. కాబట్టి నిడివి కాస్త ఎక్కువైంది. ‘అర్జున్ రెడ్డి’ కంటే కేవలం ఓ పది నిమిషాలు ఎక్కువ అంతే. ప్రేక్షకులకు ‘యానిమల్’ కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది. ► ఇండస్ట్రీపై ‘శివ’ సినిమా చూపించినంత ప్రభావం ‘అర్జున్ రెడ్డి’ సినిమా కూడా చూపించిందంటే నేను ఒప్పుకోలేను. ‘శివ’ సినిమా టైమ్‌లెస్ క్లాసిక్. ‘అర్జున్ రెడ్డి’ చిత్రం ఎంత క్లాసిక్ అనేది టైమ్ చెబుతుంది. ► ఓ దర్శకుడిగా నాకు అందరి హీరోలతో సినిమాలు చేయాలని ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత మహేశ్‌బాబుగారికి ఓ స్టోరీలైన్ చెప్పాను. రామ్‌చరణ్‌కు ఓ కథ చెప్పాను. వారు బిజీగా ఉండటం వల్ల కుదర్లేదు. అయితే ప్రభాస్‌గారితో నా తర్వాతి సినిమా ‘స్పిరిట్’ ఉంటుంది. వచ్చే ఏడాది సెప్టెంబరులో షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాం. అల్లు అర్జున్ గారితో ఓ కమిట్మెంట్ ఉంది. ∙ -
బ్లడ్ డొనేషన్ పేరుతోనూ మోసాలు!
హైదరాబాద్: రక్తం, ప్లాస్మా వంటివి అత్యవసరమైన వారిని సంప్రదించి, వారి నుంచి కొంత మొత్తం తీసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని సీసీఎస్ ఆ«దీనంలోని వెస్ట్ జోన్ క్రైమ్ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతగాడు గతంలోనూ ఇదే తరహా నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు డీసీపీ శిల్పవల్లి శుక్రవారం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా, పొనుగుటివలస ప్రాంతానికి చెందిన రెడ్డి సందీప్ 2016లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆపై హార్డ్‌వేర్ నెట్వర్కింగ్ కోర్సు కూడా పూర్తి చేశాడు. నిరుద్యోగంతో పాటు ఆరి్థక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో నేరాల బాటపట్టాడు. విశాఖపట్నంలోని ద్వారక, రెండో పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేశాడు. ఆయా కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చాడు. 2020లో కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ఆ రోగులకు వైద్యం చేయడానికి కోలుకున్న పేషెంట్ ప్లాస్మా అవసరం పెరిగింది. దీంతో పలువురు సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్ కేంద్రంగా డోనర్స్ కోసం ప్రయత్నాలు చేశారు. ఈ విషయం గమనించిన సందీప్ డోనర్ పేరుతో మోసాలు చేయాలని పథకం వేశాడు. దీనిని అమలులో పెట్టడంలో భాగంగా ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో సెర్చ్ చేశాడు. ప్లాస్మా డోనర్స్ కోసం వాటిలో ప్రకటనలు ఇచి్చన వారికి ఫోన్లు చేసేవాడు. తాను ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నానని, నాది మీకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ అని నమ్మబలికే వాడు. తాను ప్లాస్మా డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పేవాడు. అయితే తాను శ్రీకాకుళం నుంచి రావడానికి రవాణా, ఇతర ఖర్చులకు కొంత డబ్బు కావాలని కోరేవాడు. తన బ్యాంకు ఖాతా లేదా ఈ–వాలెట్ వివరాలు పంపి వాటిలో డబ్బు వేయించుకునే వాడు. ఆపై వారి ఫోన్లకు స్పందించకుండా మోసం చేసేవాడు. మరికొందరికి కొవిడ్ రోగులకు చికిత్స కోసం వాడే యాంటీ వైరల్ డ్రగ్స్ ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేశాడు. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ కలిపి దాదాపు 200 మందిని మోసం చేశాడు. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని బెట్టింగ్‌లతో పెట్టేవాడని డీసీపీ తెలిపారు. నగరానికి చెందిన కొందరినీ మోసం చేయడంతో ఇతడిపై సిటీలోని పంజగుట్ట, రామ్‌గోపాల్‌పేట, బంజారాహిల్స్‌తో పాటు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలోనూ కేసులు నమోదు కావడంతో అరెస్టయ్యాడు. కొన్ని కేసుల్లో శిక్ష కూడా పడింది. తాజాగా మరోసారి సోషల్‌మీడియా వేదికగా బ్లడ్, ప్లాస్మా డొనేషన్ పేరుతో మోసాలు ప్రారంభించిన అతడిపై దోమలగూడ ఠాణాలో కేసు నమోదు కావడంతో వాంటెడ్‌గా మారాడు. సీసీఎస్‌లోని వెస్ట్‌జోన్ క్రైమ్ టీమ్ ఇన్స్పెక్టర్ డి.భిక్షపతి నేతృత్వంలోని బృందం శుక్రవారం పట్టుకుంది. -
సూపర్ హిట్ సినిమాను వదులుకున్న బన్నీ?
టాలీవుడ్లో ఒక్కోసారి చాలామంది హీరోలు వారి వద్దకు వచ్చిన సూపర్ హిట్ సినిమాలను మిస్ అవుతూ ఉంటారు. అందులో కంటెంట్ నచ్చకనో, కథలో కొన్ని సన్నివేశాలు సెట్ కావనే సందేహమో తెలియదు.. ఆ సినిమాలే భారీ హిట్స్ అవుతుంటాయి కూడా. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకే ఒక్క కారణం వల్ల సూపర్ హిట్ సినిమాను వదులుకున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: సైతాన్ ట్రైలర్లో పచ్చిబూతులు, అసభ్య సన్నివేశాలు.. డైరెక్టర్ ఏమన్నాడంటే?) విజయ్ దేవరకొండకు లైఫ్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'అర్జున్ రెడ్డి' కథను ముందుగా బన్నీకి చెప్పాడట డైరెక్టర్ సందీప్ రెడ్డి. కథ రాసుకునే సమయంలోనే బన్నీని ఫిక్స్ చేసుకున్నాడట. అయితే, ఈ సినిమాలో ఎక్కువగా లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. అంతే కాకుండా కచ్చితంగా లిప్ కిస్ ఇవ్వాల్సిందే అంటూ డైరెక్టర్ కండిషన్ పెట్టాడట. దీంతో వెంటనే అల్లు అర్జున్ పదేపదే కిస్ చేయటం వల్ల తన ఇమేజ్ ఎక్కడ డామేజ్ అయిపోతుందో అని ఈ సినిమాకు నో చెప్పేశాడని సమాచారం. తర్వాత శర్వానంద్ దగ్గరికి సందీప్ రెడ్డి వెళ్తే.. అదే కారణంతో రిజక్ట్ చేశాడట. చివరిగా విజయ్ దేవరకొండ ఓకే చెప్పడం ఆ తర్వాత భారీ హిట్ కొట్టడమే కాకుండా తనకు ఆ సినిమా విపరీతమైన ఫ్యాన్స్‌ను తెచ్చిపెట్టింది. (ఇదీ చదవండి: ప్రభాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటి) -
గ్యాంగ్ స్టార్ గా మహేష్ బాబు...!
-
YSR District: సందీప్ రెడ్డికి భారత జట్టు పగ్గాలు
సాక్షి, హైదరాబాద్: అమెరికన్ ఫుట్‌బాల్ (రగ్బీ తరహా ఆట) అంతర్జాతీయ సమాఖ్య (ఐఎఫ్‌ఏఎఫ్) ప్రపంచ చాంపియన్ షిప్లో పాల్గొనే భారత జట్టుకు వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన సందీప్ రెడ్డి పోతిరెడ్డి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇజ్రాయెల్ వేదికగా ఈనెల 6 నుంచి 8 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. చీఫ్ కోచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో 42 మందితో కూడిన భారత జట్టు శిక్షణ శిబిరం హైదరాబాద్‌లో ముగిసింది. భారత జట్టులో సందీప్ రెడ్డితో సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన సండ్రి సంతోష్, కేతన్ జోగ, రోహిత్ బండ, అవనీష్, శివ ప్రసాద్ గుండ, మణికంఠ వీరలకు కూడా చోటు లభించింది. చదవండి: T10 League: సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో.. అయినా ఊచకోతే -
ఏపీ సీఎం జగన్‌ను కలిసిన సందీప్‌రెడ్డి
సాక్షి, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ ప్రేమావతిపేటకు చెందిన ఏనుగుల సందీప్‌రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో చేపడుతున్నఅభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని కొనియాడారు. దివంగత నేత వైఎస్ఆర్ తనయుడు సీఎం జగన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ఇలాగే ప్రజలకు సేవ చేయాలని ఆంకాంక్షించారు. -
కొత్త సీన్లతో మళ్లీ అర్జున్ రెడ్డి!
అర్జున్ రెడ్డి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన తెలుగు సినిమా అది. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో వివాదాలు సృష్టించటంతో పాటు అదే స్థాయిలో విజయం కూడా సాధించింది. ప్రేమకథను ఇంత బోల్డుగా చూపించొచ్చా అనేలా అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ అయిపోయాడు. ఇక అర్జున్ రెడ్డికి ఫిదా అయిన బాలీవుడ్.. సందీప్‌రెడ్డిని అక్కడికి తీసుకెళ్లింది. అక్కడ షాహిద్ కపూర్‌తో కబీర్ సింగ్‌గా తెరకెక్కించి కనక వర్షాన్ని కురిపించాడు. ఇక అర్జున్ రెడ్డి విడుదలై సరిగ్గా మూడేళ్లవుతుంది(ఆగస్ట్ 25 నాటికి). (చదవండి : ‘చిల్లింగ్ విత్ బాయ్స్’ అంటున్న విజయ్ దేవరకొండ) ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమా 4.20 నిమిషాల నిడివితో ఉండేలా తెరకెక్కించామని, తప్పనిసరి పరిస్థితిల్లో కొన్ని కొన్ని సీన్లను తొలగించాల్సి వచ్చిందన్నారు. ఫైనల్‌గా 3.45 నిమిషాల నిడివి గల సినిమాను రెడీ చేసుకున్నామని చెప్పారు. కానీ, కొన్ని కారణాల వల్ల చివరికి 3.06గంటల నిడివి ఉన్న సీనిమాను మాత్రమే విడుదల చేశామని చెప్పారు. 3.45గంటల నిడివితో విడుదల చేస్తే మరింత హిట్ సాధించేదని చెప్పుకొచ్చారు. కట్ చేసిన సీన్లతో మొత్తం 3.45 నిమిషాల నిడివి గల సినిమాను ఐదేళ్లు పూర్తయ్యే సందర్భంగా 2022 ఆగస్ట్ 25న విడుద చేయాలని ప్లాన్ చేసుకున్నామని సందీప్ రెడ్డి తెలిపారు. అందులో చాలా ఫన్నీ సీన్లు కూడా ఉన్నాయట. శివ, కమల్, విద్య, కీర్తి ఎలా క్లోజ్ అయ్యారు, అర్జున్ రెడ్డి స్కూల్ ప్రెండ్స్.. అతని బాల్యం, బుల్లెట్ బైక్ సంబంధించిన సీన్లు కొత్తగా విడుదల చేయబోయే సినిమాలో ఉంటాయట. అలాగే అర్జున్ రెడ్డి పెంచుకున్న కుక్కకు సంబంధించిన కామెడీ సీన్ కూడా ఉండబోతుదంట. మళ్లీ ఈ సినిమా ఏ రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి మరి. -
జీవితంపై విరక్తితో ఆత్మహత్య
మోపాల్: మోపాల్‌కు చెందిన జనగాం సందీప్‌రెడ్డి (27) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు మోపాల్ ఎస్‌హెచ్‌వో పూర్ణేశ్వర్ శుక్రవారం తెలిపారు. ఆయన కథ నం ప్రకారం.. సందీప్‌రెడ్డికి మూడేళ్ల క్రితం డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామానికి చెందిన ప్రవళికతో వివాహం అయింది. వీరికి ఒక కుమార్తె ఉంది. సందీప్‌రెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా కుటుంబంలో చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులతో మానసిక వేదనకు గురవుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది గురువారం ఉదయం పొలం వద్ద పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన అనంతరం వాంతులు చేసుకోవడంతో పురుగుల మందు వాసన వచ్చింది. కుటుంబ సభ్యులు గమనించి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి భూదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. -
కొత్త కాన్సెప్ట్
రుద్రాక్ష, ధన్య బాలకృష్ణ జంటగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హల్ చల్’. గణేష్ కొల్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ బాగుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉందనిపిస్తోంది. ట్రైలర్ చూసిన వారు తప్పకుండా సినిమా చూస్తారు’’ అన్నారు. ‘‘మూడు సంవత్సరాలు ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి నిర్మించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ఎమ్ఎస్కె డిజిటల్ ద్వారా మల్కాపురం శివకుమార్‌గారు మా సినిమాను రిలీజ్ చేస్తున్నారు’’ అన్నారు గణేష్ కొల్లూరి. ‘‘మంచి కథతో కూడిన ఇలాంటి సినిమాతో హీరోగా పరిచయం కావడం నా అదృష్టం’’ అన్నారు రుద్రా„Š . ‘‘సరికొత్త కథతో రూపొందిన చిత్రమిది. గణేష్‌గారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను’’ అన్నారు శ్రీపతి కర్రి. -
చేవెళ్ల ఎంపీ కొండా అరెస్ట్..విడుదల
హైదరాబాద్: తన ఇంటికి నోటీసు ఇవ్వడానికి వచ్చిన గచ్చిబౌలి ఎస్ఐ కృష్ణ, కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించి దాడి చేసిన ఘటనలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితోపాటు ఆయన కార్యాలయంలో ఉద్యోగి చంద్రప్రకాశ్, ఆయన పీఏ వై.హరిప్రసాద్‌లకు బంజారాహిల్స్ పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు అరెస్ట్ చేసి బెయిల్ మంజూరు చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కొండా అనుచరుడు సందీప్‌రెడ్డి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ డబ్బులు పంపిణీ చేస్తుండగా గచ్చిబౌలి పోలీసులు పట్టుకున్నారు. సందీప్‌పై కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 16న ఎస్ఐ కృష్ణ, కానిస్టేబుల్‌తో కలిసి బంజారాహిల్స్‌లోని కొండా నివాస కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిపై ఎస్ఐ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 29న నాంపల్లి రెండవ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ముందస్తు తీర్పునిస్తూ కొండాతోపాటు చంద్రప్రకాశ్, హరి ప్రసాద్‌లను అరెస్ట్ చేసే ముందు వ్యక్తిగత పూచీకత్తు తీసుకొని బెయిలివ్వాలని ఆదేశించారు. దీంతో రూ.25 వేల విలువైన రెండు పూచీకత్తులు సమర్పించిన విశ్వేశ్వర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి బెయిల్‌పై విడుదల చేశారు. ఆయన ఉద్యోగులను కూడా రూ.5 వేల చొప్పున పూచికత్తులు తీసుకొని విడుదల చేశారు. -
ఈవీఎంలను హ్యాక్ చేయలేం!
సాక్షి, హైదరాబాద్: ఈవీఎంలను హ్యాకింగ్/ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని ఐటీ నిపుణుడు సందీప్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు కావాలనే పనికట్టుకుని ఈవీఎంలపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం)ను డీ–కోడ్ చేయడం కష్టతరమని, వీటిలో ఎలాంటి డివైజ్ డ్రైవర్స్‌ను ఇన్స్టాల్ చేయలేరని సందీప్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వివిధ దశల్లో ఈవీఎంల సెక్యూరిటీని పరిశీలించిన తర్వాతే వినియోగిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ‘కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ముఖ్యమైన వ్యక్తులు.. అభద్రతాభావంతో ఈవీఎంలపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేనో ఎంబేడెడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా క్రిప్టాలజీ, ఎన్క్రిప్టింగ్ మీద 15ఏళ్లుగా పనిచేస్తున్నాను. నా అనుభవం ద్వారా తెలుసుకున్న వాస్తవాలను యావదాంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. ప్రభుత్వ పెద్దలు ఆరోపణలు చేస్తున్నట్లుగా ఓ ఈవీఎంను ట్యాంపర్ చేయాలంటే దానికి హార్డ్‌వేర్, కమ్యూనికేషన్ రేడియోస్, సపోర్టింగ్ సాఫ్ట్వేర్ కీలకం. ఒకవేళ ఈవీఎంని నెట్వర్క్ వీడియోస్‌తో అనుసంధానం చేయాలంటే చాలా ఖరీదైన పని. ఈవీఎంలలో ఎలాంటి డివైజ్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయలేరు. ఒకసారి ఫర్మ్‌వేర్ కంపైల్ చేసిన తర్వాత ఈవీఎంపైన ఫ్లాష్చేస్తే.. రెండోసారి రీ–ఫ్లాష్చేసే అవకాశం ఉండదు. అదే విధంగా బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ యూనిట్ మధ్య జరిగే కమ్యూనికేషన్ ప్రొపరేటరీ సెక్యూర్ ప్రొటోకాల్ ద్వారానే జరుగుతుంది. ఏజెంట్ సమక్షంలో సమక్షంలో బ్యాటరీ స్విచాఫ్ చేస్తారు. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా కట్ అయిపోతుంది. దీంతో అటోమెటిక్‌గా ఈవీఎంలో మెమరీ అలాగే ఉన్నప్పటికీ.. బయటి వారు యాక్సెస్ చేసేందుకు వీలుండదు. ఈవీఎంలను హ్యాక్ చేయాలని ప్రయత్నించి చాలా మంది విఫలమయ్యారు’అని సందీప్ రెడ్డి వెల్లడించారు. మన ఈవీఎంలను చాలా దేశాల్లో వినియోగిస్తున్నారని.. కానీ కావాలనే కొందరు మన దేశంలో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి వారిపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఓ హ్యాకర్ ఈవీఎంలను హ్యాక్ చేస్తానంటూ సవాల్ విసిరి భంగపడ్డారని సందీప్ తెలిపారు. ఈ ఏడాది కూడా సయ్యద్ షుజా అనే వ్యక్తి యూకే నుంచి ఈవీఎంలను హాక్ చేస్తానని, గతంలో తాను ఈసీఐఎల్‌లో పనిచేస్తున్న సమయంలో హ్యాకింగ్ చేశానని చెప్పుకున్నారు. దీంతో మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్, మరికొందరు మీడియా, రాజకీయ ప్రముఖులు లండన్ వెళ్లొచ్చారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అవాస్తవమని వారు తెలుసుకున్న విషయాన్ని కూడా సందీప్ రెడ్డి గుర్తుచేశారు. వీవీప్యాట్‌కు, బ్యాలెట్ యూనిట్‌కు మధ్య మార్పు జరిగే సమయంలో ట్యాంపర్ (మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్) జరుగుతుందంటూ కొందరు చేస్తున్న వాదన అర్థరహితం అన్నారు. ఏపీ ఎన్నికల సమయంలో 36 చోట్ల ఈవీఎంలు మోరాయించాయని.. అది కూడా ఆపరేటర్ అసమర్థత ద్వారానే జరిగిందన్నారు. ఇందులో ఈవీఎంల తప్పిదమేమీ లేదన్నారు. -
కామెడీ మిఠాయి
గాయత్రి గుప్తా, శ్వేతా వర్మ, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య తారలుగా స్వీయ దర్శకత్వంలో ప్రశాంత్‌కుమార్ రూపొందిస్తున్న ‘మిఠాయి’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. ‘‘డిఫరెంట్ కథ. తెలుగులో డార్క్ కామెడీ నేపథ్యంలో వస్తున్న చిత్రమిది’’ అన్నారు సందీప్ రెడ్డి. ‘‘డార్క్ కామెడీ మూవీ అనగానే క్యూరీయాసిటీతో వెయిట్ చేస్తున్నాం. ప్రశాంత్ నాకు మంచి ఫ్రెండ్’’ అన్నారు విజయ్ దేవరకొండ. ‘‘మంచి టీమ్ చేస్తున్న సినిమా. అందరికీ నచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు ప్రశాంత్ కుమార్. ప్రియదర్శి, భూషణ్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, ఎగ్జిక్యూ టివ్ ప్రొడ్యూసర్: కృష్ణ వొడవల్లి. -
ఆమె ఎటువంటి డిమాండ్ చేయలేదు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికి ఎటువంటి అవకాశాలు వస్తాయో చెప్పలేమని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి తన కుమారుడు సందీప్‌రెడ్డితో కలిసి గురువారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువాతో వీరిద్దని కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మాధవరెడ్డి తనకు ఆత్మీయ మిత్రుడని, ఆయన మన మధ్య లేకపోవటం దురదృష్టకరమన్నారు. నల్లగొండ జిల్లా నుంచి చాలా మంది మంత్రులయ్యారు కానీ, జిల్లా మొత్తాన్ని పట్టించుకున్న ఏకైక మంత్రి మాధవరెడ్డి అని ప్రశంసించారు. ఉమామాధవరెడ్డి తనకు తోబుట్టువు లాంటివారని, తమ పార్టీలో చేరేందుకు ఆమె ఎటువంటి డిమాండ్ చేయలేదని వెల్లడించారు. ఉమామాధవరెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి రావడం సొంత చెల్లి ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉందన్నారు. ఎంతో దార్శనికత కలిగిన ఎలిమినేటి కుటుంబం తనకు ఇంతకాలం దూరంగా ఉన్నారని బాధపడినట్టు చెప్పారు. తమ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీయిచ్చారు. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న చాలామందికి సహనం లేదని విమర్శించారు. నల్గొండ జిల్లా బాగా వెనకపడిన జిల్లా అని, భువనగిరి వరకు ఐటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి జరిగి తీరాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందేలా యాదాద్రిని అభివృద్ధి చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి త్వరలో నీళ్లు ఇస్తామని తెలిపారు. జనవరి నుంచి రైతులకు 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తామని కేసీఆర్ హామీయిచ్చారు. -
వెండితెర వండర్స్
-
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో 'అర్జున్ రెడ్డి' సినిమా ఓ హాట్ టాపిక్. కేవలం ఒకే ఒక్క సినిమాతో సందీప్ రెడ్డి స్టార్ దర్శకుల జాబితాలో చేరిపోయారు. సందీప్‌తో సినిమాలు చేయడానికి టాలీవుడ్లో ఇప్పడు చాలా మంది హీరోలు, నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఈ దశలో సందీప్ రెడ్డి తెలుగు సినిమాలు చేయనంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. అర్జున్ రెడ్డి సినిమాను యువత బాగా ఆదరిస్తున్నారు. కాకపోతే సినిమాపై మహిళా సంఘాలు వ్యతిరేక గళమెత్తాయి. సినిమా థియేటర్లకు వెళ్లి మరీ సినిమా చూడొద్దంటూ అడ్డుకుంటున్నాయి. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన సందీప్ రెడ్డి సినిమాలు తీయడంపై సీరియస్‌గా స్పందించారు. సినిమాను అడ్డుకుంటే తాను ఏం చేయలేనని, మహిళా సంఘాలు ఎందుకు ఇలా అడ్డుకుంటున్నారో తనకు అర్థం కావట్లేదని అన్నారు. ఇలాగే భవిష్యత్తులో కూడా జరిగితే బాలీవుడ్‌కు వెళ్లి హిందీ, భోజ్‌పురి, కన్నడ భాషల్లో సినిమాలు తీసుకుంటానని సందీప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ కూడా అడ్డు తగిలితే ఇండియా వదిలి హాలీవుడ్లో సినిమాలు చేస్తానంటూ ఆశ్చర్యకరంగా మాట్లాడారు. సందీప్ రెడ్డి తదుపరి సినిమా యువ కథానాయకుడు శర్వానంద్‌తో చేయబోతున్నట్లు సమాచారం. -
మిత్రా హత్యకేసులో నిందితుడి అరెస్ట్
మూడు రోజుల క్రితం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూనాగోల్‌లో మిత్రా(22) అనే విద్యార్థి హత్యకేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బుల విషయంలో తేడా రావడంతో మిత్రాను సందీప్‌రెడ్డి కత్తితో మెడపై గాయపరిచాడు. గాయపడిన మిత్రాను ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతిచెందాడు. హత్యకు పాల్పడిన నిందితుడు సందీప్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని సీజ్ చేశారు. -
సెంబ్ కార్ప్ గాయత్రీ థర్మల్ పవర్ ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపు!
♦ రూ. 12,000 కోట్లతో 5,280 మెగావాట్లకు పెంపు ♦ వచ్చే ఏడాదిలోగా రెండు బీవోటీ ప్రాజెక్టుల విక్రయ లక్ష్యం ♦ గాయత్రి ప్రాజెక్ట్స్ ఎండీ సందీప్ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సింగపూర్‌కి చెందిన సెంబ్‌కార్ప్‌తో కలసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ధర్మల్ విద్యుత్ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసే ఆలోచనలో ఉన్నట్లు గాయత్రి ప్రాజెక్ట్స్ ప్రకటించింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలో ఈ భాగస్వామ్య కంపెనీ రెండు దశల్లో 2,640 మెగావాట్ల ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఐదేళ్లలో ఈ సామర్థ్యాన్ని 5,280 మెగావాట్లకు పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు గాయత్రీ గ్రూపు వ్యవస్థాపకుడు టి. సుబ్బరామిరెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుమారు రూ. 12,000 కోట్ల పెట్టుబడి వ్యయంతో ఉత్పత్తి వ్యయం రెట్టింపు చేసే అవకాశం ఉందన్నారు. దాదాపు రూ. 20,000 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే అతిపెద్ద ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయత్రీ ప్రాజెక్ట్స్ ఎండీ సందీప్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత యూనిట్‌ను రెండు దశల్లో ఏర్పాటు చేశామని, ఇప్పటికే 1,320 మెగావాట్ల యూనిట్ పనిచేస్తుండగా, మిగిలిన 1,320 మెగావాట్ల యూనిట్ సెప్టెంబర్‌లోగా వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కాంప్లెక్స్‌లో తగినంత భూమి లభ్యత ఉండటంతో ఇప్పటితో పోలిస్తే సగం ఖర్చుతోనే ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా విస్తరణపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం గాయత్రీ ప్రాజెక్ట్స్ చేతిలో రూ. 10,000 కోట్ల విలువైన ఈపీసీ కాంట్రాక్టులు చేతిలో ఉన్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గాయత్రీ ప్రాజెక్ట్స్ అభివృద్ధి చేసిన ఏడు రోడ్డు ప్రాజెక్టులను విక్రయించే యోచనలో ఉన్నప్పటికీ సరైన ధర రాకపోవడంతో ముందడుగు పడటం లేదన్నారు. ఈ ప్రాజెక్టుల నుంచి టోల్ ఫీజుల రూపంలో ఆదాయం వస్తుండటంతో వెంటనే అమ్మాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఏడాదిలోగా కనీసం రెండు రోడ్డు ప్రాజెక్టులను విక్రయించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. -
ఇది నాకు పునర్జన్మ : సందీప్‌రెడ్డి
శాతవాహన యూనివర్సిటీ : నేపాల్‌ను భయబ్రాంతులకు గురిచేసిన భూకంప ప్రదేశం నుంచి ఓ ఎంబీబీఎస్ విద్యార్థి సురక్షితంగా తల్లిదండ్రుల ఒడిచేరారు. కళ్లెదుటే భవనాలు ఊగిపోతుంటే.. తమకెక్కడ ముప్పు వస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నామని మంగళవారం మీడియూ ఎదుట వెల్లడించారు. వివరాలు ఇవీ.. కరీంనగర్ నగరానికి చెందిన కె.సందీప్‌రెడ్డి కఠ్మాండు సమీపంలో బరత్పూర్, చింతవాన్లో కాలేజ్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. శనివారం ఒక్కసారిగి భూకంపం రావడంతో హడలిపోయాడు. ఆరోజు సెలవు దినం కావడంతో కళాశాలలో ఎవరూ లేరు. హాస్టల్లో ఉన్న విద్యార్థులకు భూకంప ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో అందరూ అప్రమత్తమయ్యూరు. మెడికల్ కళాశాలలోని వ్యాధిగ్రస్తులు, విద్యార్థులను యూజమాన్యం డేరాల్లోకి తరలించింది. ముందస్తు హెచ్చరికలతోనే వారు ప్రాణాలతో గట్టెక్కారు. అధికారులు కేటాయించిన వాహనాల సాయంతో ఆదివారం గోరఖ్‌పూర్ చేరుకున్నారు. సోమవారం న్యూఢిల్లీ చేరిన వారిని ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ తరలించారు. అందులోని సందీప్‌రెడ్డి మంగళవారం కరీంనగర్ చేరి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నుంచి ఇరవై ఐదుగురు అక్కడ విద్యనభ్యసిస్తున్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇండియన్ ఎంబసీతోపాటు, కళాశాల యాజమాన్యంతో ప్రతీరెండుగంటలకోఆరి మాట్లాడారు. దీంతో బాధితులను తక్షణమే సొంతప్రాంతాలకు తరలించారు. కాగా, తామున్న ప్రదేశంలో ప్రాణనష్టం జరగకపోయినా కళ్లెదుటే భవనాలు పగుళ్లు చూపడం, గాలికి చెట్టు ఊగినట్లు భవనాలు ఊగిపోవడం చూస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నామని సందీప్‌రెడ్డి తన అనుభూతి వెల్లడించారు. భూకంపం ప్రభావం నుంచి తప్పించుకోవడం తనకు పునర్జన్మనిచ్చినట్లయిందని ఆనందం వ్యక్తం చేశారు. పరిస్థితులు చక్కబడ్డాక వైద్యవిద్య చదివేందుకు అక్కడకు వెళ్తానని ఆయన చెప్పారు. -
'దేవుడు కరుణించాడు'
-
'సమైక్య శంఖారావం'కు యూకే ఎన్నారైల మద్దతు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కొరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్ది శనివారం నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం బహిరంగ సభ విజయవంతం కావాలని లండన్‌లోని ఆ పార్టీ యుకే- యూరోప్ విభాగం ఎన్నారైలు ఆకాంక్షించారు. సమైక్య శంఖారావం సభకు ఎన్నారైలు సంపూర్ణ మద్దతు తెలిపారు. శుక్రవారం లండన్‌లోని ఎన్నారైలు ఆత్మీయ సమావేశం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నారైలు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్‌లతో శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ యుకే- యూరోప్ విభాగం అధ్యక్షుడు సందీప్ రెడ్డి మాట్లాడుతూ... సమైక్య శంఖారావం సభ ఏ ఒక్కరికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సభ కాదని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరి అవలంభించిందని ఆయన ఆరోపించారు. ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టేందుకు ఈ సభను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఇప్పటికైనా రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్య శంఖారావం సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అలాగే రాజన్న రాజ్యం అవశ్యకతను ప్రజల్లోకి ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు, పరిపాలన అనిశ్చితికి అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ఆ రెండు పార్టీ లు ఎన్ని కుటిల రాజకీయాలకు పాల్పడిన ప్రజలు వైఎస్ జగన్ పక్షం ఉన్నారని సందీప్ రెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేశారు. విలువలు, విశ్వసనీయత వైఎస్ జగన్ డీఎన్ఏ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ యుకే- యూరోప్ విభాగం ఉపాధ్యక్షుడు యోగేంద్ర పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడ్డాయని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి ఒకే తాటిపై నడిపిన మహానేత వైఎస్ఆర్ అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనుసరిస్తున్న వైఖరిపై ఎన్నారైలు నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన రీతిలో బుద్ది చెబుతారని యోగేంద్ర పేర్కొన్నారు.