చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో మిత్రా(22) అనే విద్యార్థి హత్య కేసు నిందితుడిని అరెస్టుచేశారు.
మూడు రోజుల క్రితం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూనాగోల్‌లో మిత్రా(22) అనే విద్యార్థి హత్యకేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బుల విషయంలో తేడా రావడంతో మిత్రాను సందీప్‌రెడ్డి కత్తితో మెడపై గాయపరిచాడు. గాయపడిన మిత్రాను ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతిచెందాడు. హత్యకు పాల్పడిన నిందితుడు సందీప్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని సీజ్ చేశారు.