సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్‌లో 'అర్జున్ రెడ్డి' సినిమా ఓ హాట్ టాపిక్. కేవలం ఒకే ఒక్క సినిమాతో సందీప్ రెడ్డి స్టార్ దర్శకుల జాబితాలో చేరిపోయారు. సందీప్‌తో సినిమాలు చేయడానికి టాలీవుడ్‌లో ఇప్పడు చాలా మంది హీరోలు, నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఈ దశలో సందీప్ రెడ్డి తెలుగు సినిమాలు చేయనంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.
అర్జున్ రెడ్డి సినిమాను యువత బాగా ఆదరిస్తున్నారు. కాకపోతే సినిమాపై మహిళా సంఘాలు వ్యతిరేక గళమెత్తాయి. సినిమా థియేటర్లకు వెళ్లి మరీ సినిమా చూడొద్దంటూ అడ్డుకుంటున్నాయి. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన సందీప్ రెడ్డి సినిమాలు తీయడంపై సీరియస్‌గా స్పందించారు.
సినిమాను అడ్డుకుంటే తాను ఏం చేయలేనని, మహిళా సంఘాలు ఎందుకు ఇలా అడ్డుకుంటున్నారో తనకు అర్థం కావట్లేదని అన్నారు. ఇలాగే భవిష్యత్తులో కూడా జరిగితే బాలీవుడ్‌కు వెళ్లి హిందీ, భోజ్‌పురి, కన్నడ భాషల్లో సినిమాలు తీసుకుంటానని సందీప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ కూడా అడ్డు తగిలితే ఇండియా వదిలి హాలీవుడ్‌లో సినిమాలు చేస్తానంటూ ఆశ్చర్యకరంగా మాట్లాడారు. సందీప్ రెడ్డి తదుపరి సినిమా యువ కథానాయకుడు శర్వానంద్‌తో చేయబోతున్నట్లు సమాచారం.
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
Published Fri, Sep 1 2017 12:29 PM | Last Updated on Tue, Sep 12 2017 1:34 AM
Advertisement
Advertisement