
అందుకే బెట్ కట్టడానికి రెడీ అన్నా! : విజయ్ దేవరకొండ
‘‘అర్జున్‌రెడ్డి’ బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందనీ, అదేమాటపై నేను బెట్ కట్టడానికి కూడా రెడీ అని ట్రైలర్ విడుదల రోజు చెప్పా. ఆ మాటలు కొంతమందిని బాధించాయి. ఓ యాక్టర్‌కి తన సినిమాపై నమ్మకం లేకపోతే సిగ్గుచేటు. నా సినిమాపై నాకు నమ్మకం లేకపోతే ఇంకెవరికి ఉంటుంది. నా సినిమాపై నమ్మకం లేని రోజు కూడా తప్పకుండా వస్తుంది. అయితే, అది ఈరోజు కాదని చెప్పగలను’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. విజయ్‌దేవర కొండ, షాలిని జంటగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది.
సోమవారం ఈ సినిమా ప్రీ–రిలీజ్, ఆడియో వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో శర్వానంద్ ఆడియో సీడీని విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మధ్య కాలంలో విన్న హార్ట్ హిట్టింగ్ లవ్‌స్టోరీ ఇదనీ, నిజమైన ప్రేమ అంటే ఏంటో ఈ సినిమా చెబుతుందని కూడా శర్వానంద్ అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘సెన్సార్ వాళ్లు మా సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. కొన్ని సన్నివేశాల్లో మ్యూట్ చేశారు. నన్ను మ్యూట్ చేశారు కానీ, ప్రేక్షకులను మ్యూట్ చేయలేరు.
ప్రేక్షకులే థియేటర్‌లో నాకు డబ్బింగ్ చెప్పాలి’’ అన్నారు. ‘‘సందీప్‌రెడ్డి మంచి మిత్రుడు. ఈ సినిమా చూశా. చాలా బాగుంది. ఎమోషనల్ పార్ట్ హై రేంజ్‌లో ఉంటుంది. వండర్‌ఫుల్ లవ్‌స్టోరీ’’ అన్నారు దర్శకుడు క్రాంతి మాధవ్. సందీప్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘మూడు గంటల ఒక నిమిషం నలభైఏడు సెకన్ల నిడివి ఉన్న మూవీ ఇది. హెవీ ఎమోషన్స్‌తో సాగే మంచి రొమాంటిక్ మూవీ. నేను ఏదైతే ఊహించుకున్నానో అలానే వచ్చింది. కుటుంబ సభ్యులతో కలసి చూసేలా ఉంటుంది’’ అన్నారు. దర్శకులు ప్రణయ్‌రెడ్డి, నందినీరెడ్డి, తరుణ్ భాస్కర్, శివ నిర్వాణ, నిర్మాత స్వప్నదత్ మాట్లాడారు.