
యాటిట్యూడ్ చూపిస్తున్న 'అర్జున్ రెడ్డి'
పెళ్ళిచూపులు చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న విజయ్ దేవర కొండ హీరోగా రూపొందుతున్న చిత్రం 'అర్జున్ రెడ్డి'.
పెళ్ళిచూపులు చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న విజయ్ దేవర కొండ హీరోగా రూపొందుతున్న చిత్రం 'అర్జున్ రెడ్డి'. ప్రణయ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షాలిని హీరోయిన్‌గా నటిస్తుంది. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించే విజయ్ ఈ సినిమాలో మెడికల్ స్టూడెంట్ గా నటిస్తున్నాడు.
కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని డిఫరెంట్ యాటిట్యూడ్ తో ఇబ్బంది పడే కుర్రాడిగా నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఆగస్టు 25న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈసినిమా ట్రైలర్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. మూడు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో విజయ్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జోరుగా జరుగుతోంది.