
సాక్షి, హైదరాబాద్: అమెరికన్ ఫుట్‌బాల్ (రగ్బీ తరహా ఆట) అంతర్జాతీయ సమాఖ్య (ఐఎఫ్‌ఏఎఫ్) ప్రపంచ చాంపియన్ షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన సందీప్ రెడ్డి పోతిరెడ్డి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇజ్రాయెల్ వేదికగా ఈనెల 6 నుంచి 8 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.
చీఫ్ కోచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో 42 మందితో కూడిన భారత జట్టు శిక్షణ శిబిరం హైదరాబాద్‌లో ముగిసింది. భారత జట్టులో సందీప్ రెడ్డితో సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన సండ్రి సంతోష్, కేతన్ జోగ, రోహిత్ బండ, అవనీష్, శివ ప్రసాద్ గుండ, మణికంఠ వీరలకు కూడా చోటు లభించింది.
చదవండి: T10 League: సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో.. అయినా ఊచకోతే
Comments
Please login to add a commentAdd a comment