సందీప్‌రెడ్డి(ఫైల్)
మోపాల్: మోపాల్‌కు చెందిన జనగాం సందీప్‌రెడ్డి (27) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు మోపాల్ ఎస్‌హెచ్‌వో పూర్ణేశ్వర్ శుక్రవారం తెలిపారు. ఆయన కథ నం ప్రకారం.. సందీప్‌రెడ్డికి మూడేళ్ల క్రితం డిచ్‌పల్లి మండలం సుద్దులం గ్రామానికి చెందిన ప్రవళికతో వివాహం అయింది. వీరికి ఒక కుమార్తె ఉంది. సందీప్‌రెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
కొన్ని రోజులుగా కుటుంబంలో చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులతో మానసిక వేదనకు గురవుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది గురువారం ఉదయం పొలం వద్ద పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన అనంతరం వాంతులు చేసుకోవడంతో పురుగుల మందు వాసన వచ్చింది. కుటుంబ సభ్యులు గమనించి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి భూదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment