తమిళసినిమా: సంచలన నటిగా ముద్ర వేసుకున్న పార్వతి నాయర్ బహుభాష నటిగా రాణిస్తున్నారు. తమిళంలో ఉత్తమ విలన్, మాలై నేరత్తు మైకం, ఎంకిట్ట మోదాదే, నిమిర్ తదితర చిత్రాల్లో నటించింది. ఈ అమ్మడు ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏ రంగానికి చెందిన వారికైనా అదృష్టం చాలా ముఖ్యమని చెప్పింది. అయితే అది జీవితంలో ఒకసారి మాత్రమే తలుపు తడుతుందని, వెంటనే దానిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది. తాను మాత్రం దానిని మిస్ చేసుకున్నానని చెప్పింది. తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డిలో కథానాయకిగా తాను నటించాల్సి ఉందని, అయితే అందులో లిప్‌లాక్ సన్నివేశాలు, రొమాన్స్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో తాను నిరాకరించినట్లు పేర్కొంది.
చదవండి: ఈ గల్లీబాయ్ పేరు అంతర్జాతీయ స్టేజ్‌పై వినిపించింది: రాహుల్ ఎమోషనల్
నిజానికి ఆ అవకాశాన్ని వదులుకోకూడదని చిత్రం చూసిన తరువాత చాలా బాధపడ్డానని చెప్పింది. వాస్తవానికి అర్జున్‌రెడ్డి ఒక అందమైన చిత్రమని తెలిపింది. ఆ చిత్రాన్ని నిరాకరించి పెద్ద తప్పు చేశాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇకపోతే జీవితంలో తనకు కలిగిన మరో అద్భుత అవకాశం ఉత్తమవిలన్ కమలహాసన్‌తో కలిసి నటించానని పేర్కొంది. ఆ అనుభవాన్ని తాను జీవితాంతం మరిచిపోలేనని చెప్పింది. కమలహాసన్ సరసన నటించాను అన్న విషయాన్ని ఇప్పుడు తలచుకున్నా నమ్మసక్యంగా లేదని చెప్పింది. కాగా ఒకే తరహా కథా పాత్రలు మళ్లీ మళ్లీ చేయడం తనకు ఇష్టం ఉండదని పార్వతి నాయర్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment