Neetho Unte Chalu Song Out From Bimbisara: 'అతనొక్కడే' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కల్యాణ్ రామ్ 'పటాస్', '118' వంటి చిత్రాలతో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన చిత్రం 'బింబిసార'. 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనే క్యాప్షన్ ద్వారా ఈ మూవీ ఒక టైమ్ ట్రావెల్ చిత్రమని చెప్పకనే చెబుతున్నారు.
ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే విడుదలై టీజర్, ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్‌కు మంచి స్పందన లభించింది. ఇటీవల గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో సాంగ్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. 'నీతో ఉంటే చాలు' అంటూ సాగే ఈ గీతం మనసుకు హత్తుకునేలా ఉంది. స్వీయ సంగీత దర్శకత్వంలో ఎంఎం కీరవాణి రాసిన ఈ పాటను మోహన్ భోగరాజు, శాండిల్య ఆలపించారు. కాగా ఈ మూవీలో సంయుక్త మీనన్, కేథరీన్ థ్రేసా హీరోయిన్లుగా నటించారు.
చదవండి: భార్య ప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ కబుర్లు.. ఫొటో వైరల్
నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన
This melody #NeethoUnteChalu from #Bimbisara hits you different once you own it ❤️🔥
— NTR Arts (@NTRArtsOfficial) August 1, 2022
Tune into the Lyrical Video now
🔗 https://t.co/FxEIIAdgsp#BimbisaraOnAugust5th@NANDAMURIKALYAN @DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @saregamasouth pic.twitter.com/3X0fPdgZAX
చదవండి: బికినీలో గ్లామర్ ఒలకబోస్తున్న హీరోయిన్ వేదిక..
సల్లూ భాయ్‌కి లైసెన్స్‌డ్ తుపాకీ.. ఎలాంటిది అంటే ?
Comments
Please login to add a commentAdd a comment