Watch: Kalyan Ram Bimbisara Movie Making Video Released, Goes Viral - Sakshi
Sakshi News home page

Bimbisara: ‘బింబిసార’ కోసం కల్యాణ్‌రామ్‌ ఇంత కష్టపడ్డారా... మేకింగ్‌ వీడియో

Published Tue, Aug 16 2022 12:21 PM | Last Updated on Tue, Aug 16 2022 12:49 PM

Kalyan Ram Bimbisara Movie Making Video Out - Sakshi

చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని  కళకళలాడించిన చిత్రం ‘బింబిసార’. నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రెండు నెలలుగా హిట్‌ లేక విలవిలలాడుతున్న తెలుగు చిత్ర పరిశ్రమకు ఊపిరి అందించింది. ఈ చిత్రం విడుదలై పది రోజలు దాటినా ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘ది క్రానికల్స్‌’పేరిట మేకింగ్‌ వీడియోని విడుదల చేసింది.

(చదవండి: గొప్ప మనసు చాటుకున్న ప్రశాంత్‌ నీల్‌.. గర్వంగా ఉందంటూ మాజీ మంత్రి ట్వీట్‌)

ఈ చిత్రంలోని ఫైటింగ్‌ సీన్స్‌ ఎలా షూట్‌ చేశారు?సెట్‌ నిర్మాణానికి మేకర్స్‌ పడిన కష్టమేంటి? తదితర విశేషాల్ని ఈ వీడియోలో చూడొచ్చు. కల్యాణ్‌ రామ్‌  ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి నటించినట్లు తెలుస్తోంది. యంగ్‌ డైరెక్టర్‌ వశిష్టకు ఇది తొలి సినిమా అయినప్పటికీ.. అద్భుతంగా తెరకెక్కించాడు. కీరవాణి నేపథ్య సంగీతం, చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ ఈ సినిమా స్థాయిని పెంచాయి. . ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై హ‌రికృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement