బామ్మ మాటలా... | Vammo Bamma Movie Audio Release | Sakshi
Sakshi News home page

బామ్మ మాటలా...

Aug 10 2018 1:04 AM | Updated on Aug 10 2018 1:04 AM

Vammo Bamma Movie Audio Release - Sakshi

అశ్లేష,కిరణ్

సీనియర్‌ నటి శ్రీలక్ష్మి టైటిల్‌ రోల్‌ పోషించిన చిత్రం ‘వామ్మో బామ్మ’. కిరణ్, అశ్లేష జంటగా విజయ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. అనిరుధ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో సి.హెచ్‌. వెంకటేశ్వరరావు, జి. సంధ్యారెడ్డి నిర్మించారు. ఈ చిత్రం పాటలు, ట్రైలర్‌ని నిర్మాతలు సాయి వెంకట్, టి. రామసత్యనారాయణ విడుదల చేశారు. విజయ్‌ ఆనంద్‌ మాట్లాడుతూ– ‘‘కామెడీ హారర్‌ ఎంటరై్టనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో శ్రీలక్ష్మిగారే హీరో.  అనుకున్నదానికంటే సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు.

‘‘వామ్మో బామ్మ’ సినిమా చాలా బాగుంది. శ్రీలక్ష్మిగారు అద్భుతంగా నటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న సినిమాలు విడుదల చేయటం చాలా కష్టం. కానీ, ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్‌ నుంచి మంచి స్పందన వస్తోంది’’ అన్నారు సాయి వెంకట్‌. ‘‘గతంలో ‘బామ్మ మాట బంగారు బాట’ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు ‘వామ్మో బామ్మ’ కూడా అంతటి విజయం సాధించాలి’’ అన్నారు రామ సత్యనారాయణ. ‘‘కుటుంబ సభ్యులందరూ చూడదగ్గ చిత్రమిది’’ అన్నారు శ్రీలక్ష్మి. ఈ చిత్రానికి  సంగీతం: ఆదిత్య, కెమెరా: కర్ణ ప్యారసాని, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.రాజశేఖర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement