Sreelakshmi
-
అవయవాలతో వ్యాపారం
లక్ష్మీకాంత్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఆర్గాన్స్’. సందీప్తి, శ్రీలక్ష్మి, ప్రసాద్ రెడ్డి, మోహన్ ఇతర పాత్రల్లో నటించారు. రవికిరణ్ దర్శకత్వం వహించారు. రాజ్ కిరణ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత ముత్యాల రామదాసు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఆర్గాన్స్’ డిఫరెంట్ టైటిల్. అవయవ దానం చేయడం అనే మంచి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా హిట్ అయి యూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘ఆర్గాన్స్’ నా మొదటి చిత్రం. మా సినిమా చూసిన వారు కంటతడి పెట్టుకుంటారు. ఇందులో అవయవదానంతో పాటు ఫ్యామిలీ డ్రామా ఉంటుంది’’ అన్నారు రవికిరణ్. ‘‘మనిషి జీవించడానికి అవయవాలు ఎంతో ప్రధానం. కొందరు వాటిని తమ స్వార్థానికి వ్యాపారంగా మార్చేశారు. అలాంటి వాళ్లను హీరో ఏ విధంగా ఎదుర్కొన్నాడన్నదే కథ. సెన్సార్ పూర్తయింది. త్వరలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు బత్తుల లక్ష్మీనారాయణ. ∙సందీప్తి, లక్ష్మీకాంత్ -
బామ్మ మాటలా...
సీనియర్ నటి శ్రీలక్ష్మి టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘వామ్మో బామ్మ’. కిరణ్, అశ్లేష జంటగా విజయ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. అనిరుధ్ ప్రొడక్షన్స్ సమర్పణలో సి.హెచ్. వెంకటేశ్వరరావు, జి. సంధ్యారెడ్డి నిర్మించారు. ఈ చిత్రం పాటలు, ట్రైలర్‌ని నిర్మాతలు సాయి వెంకట్, టి. రామసత్యనారాయణ విడుదల చేశారు. విజయ్ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘కామెడీ హారర్ ఎంటరై్టనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో శ్రీలక్ష్మిగారే హీరో. అనుకున్నదానికంటే సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘వామ్మో బామ్మ’ సినిమా చాలా బాగుంది. శ్రీలక్ష్మిగారు అద్భుతంగా నటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న సినిమాలు విడుదల చేయటం చాలా కష్టం. కానీ, ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మంచి స్పందన వస్తోంది’’ అన్నారు సాయి వెంకట్. ‘‘గతంలో ‘బామ్మ మాట బంగారు బాట’ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు ‘వామ్మో బామ్మ’ కూడా అంతటి విజయం సాధించాలి’’ అన్నారు రామ సత్యనారాయణ. ‘‘కుటుంబ సభ్యులందరూ చూడదగ్గ చిత్రమిది’’ అన్నారు శ్రీలక్ష్మి. ఈ చిత్రానికి సంగీతం: ఆదిత్య, కెమెరా: కర్ణ ప్యారసాని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.రాజశేఖర్. -
లక్ష్యం ఎంతైనా ఆమె ముందు చిన్నదే...
విద్య, ఉద్యోగం, రాజకీయం, వ్యాపారం, క్రీడలు ఇలా ఏ రంగమైనా తామున్నామంటూ ముందుకు సాగిపోతున్నారు నారీమణులు. ఒకప్పుడు వంట గదికే పరిమితమైన అబల నేడు అంతరిక్షయానం చేస్తూ సత్తా చాటుతోంది. తమకు కాస్త ప్రోత్సాహం అందిస్తే చాలు ఎంతటి లక్ష్యమైనా చేరుకుంటామని చెబుతోంది మహిళాలోకం. ప్రముఖ కంపెనీల్లో సీఈఓలుగా ఉంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నవారు కొందరైతే.. క్రీడల్లో రాణిస్తూ భారతదేశ ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నవారు మరికొందరు.. ఉద్యోగాల సాధనలో కూడా తామేమీ పురుషులకు తక్కువ కాదని నిరూపిస్తున్నారు యువతులు. అలాంటి కొంతమంది మహిళల సక్సెస్‌పై ప్రత్యేక కథనం మీకోసం.. విజయనగరం, శృంగవరపుకోట రూరల్: నా పేరు లగుడు శ్రీలక్ష్మి, మాది ఎస్.కోట మండలంలోని ధర్మవరం స్వగ్రామం. భర్త అల్లు శ్రీనివాసులనాయుడు, తల్లిదండ్రులు లగుడు రమణమ్మ, సత్యనారాయణమూర్తిల ప్రోత్సాహంతో పట్టుదలగా చదివి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2010లో ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం విశాఖ జిల్లా ఏటికొప్పాకలో ఎస్బీఐ బ్రాంచిలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. తల్లిదండ్రులు ఇద్దరు కూడా శృంగవరపుకోట మండల పరిషత్ అధ్యక్షులుగా (ఎంపీపీ) పదవులు అలంకరించారు. భర్త శ్రీనివాసులనాయుడు బీఎస్ఎన్ఎల్లో (విశాఖ) సహాయ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా కుమార్తె అఖిల ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరన్నది నా ప్రగాఢ విశ్వాసం. ప్రస్తుత కాలంలో మగవారికి దీటుగా ఇటు ఉన్నత చదువులు, ఉద్యోగాలు సాధించడంతో పాటు రాజకీయం, వ్యాపార రంగాల్లో కూడా రాణిస్తున్నారు. మహిళలు స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ రావాలంటే ప్రతి మహిళా విద్యావంతురాలు కావాలి. మారిన ఆధునిక జీవనశైలికి అనుగుణంగా కుటుంబాలు ఆర్థికంగా వృద్ధి చెందాలంటే భార్యభర్తలిద్దరూ పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మహిళలను వంటింటికే పరిమితం చేయాలనే ఆలోచనను నుంచి ప్రతి ఒక్కరూ బయటకు రావాలి. ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఉద్యోగం చేయాల్సిన సత్తా మహిళలకు ఉంది. -
సరైన వైద్యం అందక తల్లీ, బిడ్డ మృతి
రైల్వేకోడూరు రూరల్: రైల్వేకోడూరు మండలం మైసూరివారిపల్లె పంచాయతీలో 2వ ఏఎన్ఎంగా పనిచేస్తున్న కొత్తపల్లి శ్రీలక్ష్మి(28), కుమారుడు(శిశువు) గురువారం అర్థరాత్రి మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. మృతురాలు రైల్వేకోడూరు పట్టణంలోని న్యూకృష్ణానగర్‌కు చెందిన సావిత్రి, సుబ్బరాయుడుల సంతానం. ఈమెను చిత్తూరు జిల్లా చంద్రగిరి దగ్గర సదుం గ్రామానికి చెందిన వెంకట రమణకు ఇచ్చి వివాహం చేశారు. వారికి మొదటి సంతానం రెండున్నర సంవత్సరాల బాబు ఉన్నాడు. ఆ తర్వాత గర్భం దాల్చింది. నెలలు నిండినా డెలివరీ కాకపోవడంతో గురువారం రాత్రి రైల్వేకోడూరులోని ప్రభుత్వాసుపత్రిలో చేరింది. వైద్యులు పరీక్షించి తల్లీ, బిడ్డ పల్స్ బాగున్నాయని చెప్పారు. ఆ తర్వాత డెలివరీ అయ్యేందుకు ఇంజక్షన్ వేశారు. అర్ధరాత్రి సమయంలో పరీక్షించగా బిడ్డ పల్స్ తగ్గినట్లు గుర్తించారు. ఇక్కడ వసతులు లేవని చెప్పితిరుపతికి రెఫర్ చేశారు. అర్ధరాత్రి సమయం కావడంతో 108 కూడా అందుబాటులో లేదు. 40 నిమిషాల తర్వాత ఓ వాహనం తీసుకుని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్ పరీక్షించగా అప్పటికే శిశువు మృతి చెందిందని, శిశువును బయటకు తీశారు. హైరిస్క్ కేసు అని, త్వరగా తిరుపతికి వెళ్లాలని సూచించారు. వెంటనే తిరుపతికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని సదుంకు మృతదేహాన్ని తీసుకెళ్లి దహనసంస్కారాలు చేశారు. వైద్యాధికారులు, సిబ్బంది వెళ్లి ఆమెకు నివాళులర్పించారు. ఏఎన్ఎంగా పని చేస్తూ చనిపోవడంపై పలువురు దిగ్భ్రాంతి చెందారు.