‘‘గృహం’ తమిళ్ ట్రైలర్ చుశా. హాలీవుడ్ రేంజ్‌లో ఉందనిపించింది. తెలుగు ట్రైలర్‌ను 20 సెకన్లకు మించి చూడలేకపోయా. నా చుట్టూ అందరూ ఉన్నప్పుడు ఫుల్ ట్రైలర్‌ను చుద్దామనుకున్నా. అంతలా నన్ను భయపెట్టింది. సినిమా హిట్ అవుతుంది’’ అన్నారు నాని. సిద్ధార్థ్, ఆండ్రియా జంటగా మిలింద్‌రావ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గృహం’. ఎటాకి ఎంటరై్టన్‌మెంట్ ప్రొడక్షన్‌లో వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, సిద్ధార్థ్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది.
పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నాని మాట్లాడుతూ– ‘‘జెన్యూన్ హర్రర్‌ను హర్రర్‌గా చూపించే సినిమా ‘గృహం’. హర్రర్ సినిమా చేస్తున్నప్పుడే, లొకేషన్‌లోనే సినిమా ఏంటో తెలిసిపోతుంది. థియేటర్లో ఎంజాయ్ చేయలేం. అందుకే నేను లైఫ్‌లో హర్రర్ సినిమా చేయను’’ అన్నారు. సిద్దార్థ్ మాట్లాడుతూ – ‘‘మణిరత్నంగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా నేను, మిలింద్ ఒకేసారి జాయిన్ అయ్యాం. మాకు తెలిసిన వారికి జరిగిన వాస్తవ సంఘటనకు కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ జోడించి, ఈ సినిమాను రూపొందించాం.
గిరీష్, రెహమాన్ మంచి పాటలు అందించారు. సినిమా హిట్ అవుతుంది. తెలుగులో నా టైప్ ఆఫ్ సినిమాలు ఎవరు చేస్తున్నారా? అని చూస్తే.. నాని అని తెలిసింది. నానీకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. తెలుగులో సిద్ధార్థ్ కమ్‌బ్యాక్ అంటున్నారు. ఆ మాట నాకు నచ్చదు. చిన్న గ్యాప్ వచ్చింది. మళ్లీ నేను వస్తే ‘సిద్ధార్థ్ మావాడు’ అని చెప్పడానికి ఎక్కువ టైమ్ పట్టదు. నన్ను ఫస్ట్ హీరోగా చూసింది తెలుగు ఇండస్ట్రీనే’’ అన్నారు. ‘‘సిద్దార్థ్‌ది నాది 16 సంవత్సరాల ఫ్రెండ్‌షిప్. ఇండియన్ హర్రర్ మూవీస్‌లో ‘గృహం’ మంచి సినిమాగా నిలుస్తుంది’’ అన్నారు మిలింద్.
Comments
Please login to add a commentAdd a comment