భయపెట్టడానికి రెడీ | Siddharth's Aval to release on November 3 | Sakshi
Sakshi News home page

భయపెట్టడానికి రెడీ

Published Tue, Oct 24 2017 6:07 AM | Last Updated on Tue, Oct 24 2017 6:07 AM

Siddharth's Aval to release on November 3

తమిళసినిమా: ప్రేక్షకులను భయపెట్టడానికి అన్ని హంగులతో రెడీ అవుతోంది అవళ్‌ చిత్రం. చిన్న విరామం తరువాత నటుడు సిద్దార్థ్‌ నటించిన చిత్రం అవళ్‌. ఆ గ్యాప్‌ను పూర్తి చేయడానికన్నట్లు ఆయన అవళ్‌ చిత్రంతో తమిళం, తెలుగు, హిందీ అంటూ మూడు భాషల్లో ఏక కాలంలో వస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్ర నిర్మాణంలోనూ  సిద్దార్థ్‌ భాగస్వామి అయ్యారు. వైకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ, ఎటకీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ద్వారా విలింద్‌రావ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

నటి ఆండ్రియా నాయకిగా నటించిన ఇందులో బాలీవుడ్‌ నటుడు అతుల్‌కులకర్ణి ముఖ్య పాత్రను పోషించారు. గిరీష్‌ సంగీతం, శియాస్‌ కృష్ణ చాయాగ్రహణను అందించిన ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ అధినేత రవిచంద్రన్‌ పొందారు. ఈయన ఇంతకు ముందు మంచి విజయాన్ని సాధించిన విక్రమ్‌ వేదా చిత్రాన్ని విడుదల చేశారన్నది గమనార్హం. ఈయన అవళ్‌ చిత్రాన్ని నవంబరు 3వ తేదీన విడుదల చేయడానికి సిద్ధం అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్కంఠను కలిగించే హర్రర్‌ చిత్రాలకు ప్రేక్షకుల మధ్య ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. అవళ్‌ చిత్రం ప్రేక్షకులను భయబ్రాంతులకు గురి చేస్తుందన్నారు. వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని విజయాలు సాధించే నటుడు సిద్దార్ధ్‌ అంటే తనకు చాలా ఇష్టం అన్నారు. ఆయన నటించిన అవళ్‌ చిత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ చిత్ర కాన్సెప్ట్, సాంకేతిక పరిజ్ఞానం హాలీవుడ్‌ చిత్రాల స్థాయిలో ఉంటాయని ఆయన తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement