
ఎంట్రీపై కసరత్తు
కంపెనీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగ దిగ్గజం ఎల్‌ఐసీ తాజాగా ఆరోగ్య బీమా రంగంలోకి కూడా ప్రవేశించే యోచనలో ఉంది. ఇందుకోసం ఇన్‌ఆర్గానిక్ అవకాశాలను (వేరే సంస్థను కొనుగోలు చేయడం వంటివి) పరిశీలిస్తామని సంస్థ చైర్మన్ సిద్ధార్థ మొహంతి తెలి పారు. ప్రస్తుతం దీనిపై అంతర్గతంగా కసరత్తు జరుగుతోందని వివరించారు.
అగ్ని ప్రమాద బీమా వంటి జనరల్ ఇన్సూరెన్స్ విభాగంలో ఎల్‌ఐసీకి నైపుణ్యాలు లేవని, కాకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ మా త్రం చేయగలదని మొహంతి తెలిపారు. ఇన్సూరెన్స్ చట్టాన్ని సవరించి ఒకే గొడుగు కింద లైఫ్, జనరల్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఆఫర్ చేసే విధంగా బీమా కంపెనీలకు కాంపోజిట్ లైసెన్సులు జారీ చేయొచ్చనే అంచనాల నేపథ్యంలో మొహంతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment