
అనుపమా పరమేశ్వరన్, రామ్
హీరో రామ్ మనసు గాలిలో తేలిపోతోంది. ఆయన ప్రేమలో పడటమే ఇందుకు కారణం. మరి.. సక్సెస్ కావడానికి ఆ ప్రేమకథ ఎన్ని మలుపులు తిరిగిందో వెండితెరపై చూడాల్సిందే. రామ్ హీరోగా ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘హలో గురు ప్రేమ కోసమే..’. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు.
ఇందులో అనుపమా పరమేశ్వరన్, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. రామ్‌కు మామయ్య పాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. రీసెంట్‌గా ‘మై హార్ట్ ఈజ్ ఫ్లైయింగ్’ అనే సాంగ్‌ను షూట్ చేశారట. ఈ సినిమాను దసరా సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ 18న విడుదల చేయాలనుకుంటున్నారు.