
రామ్, అనుపమా పరమేశ్వరన్
ప్రేమని గెలిపించుకునే విషయంలో లాస్ట్ స్టెప్‌లోకి వచ్చేశారట హీరో రామ్. తన ప్రేమకి ఏర్పడ్డ అడ్డంకుల్ని కష్టపడి తొలగించుకుంటున్నారట. ఇదంతా ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా కోసమే. రామ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ పార్ట్‌ను కాకినాడలో చిత్రీకరిస్తున్నారు. రామ్‌పై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాను ఈ సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చే స్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment