Simbu Thanks Audiences For Making Maanaadu Movie Success - Sakshi
Sakshi News home page

Maanaadu Movie: 'మానాడు' సక్సెస్‌.. అభినందించిన రజనీకాంత్‌

Published Tue, Nov 30 2021 8:25 AM | Last Updated on Tue, Nov 30 2021 9:28 AM

Simbu Thanks Audiences For Making Maanaadu Success - Sakshi

Simbu thanks fans for overwhelming support for Maanaadu: మానాడు చిత్ర యూనిట్‌ సంబరాలు చేసుకుంటోంది. శింబు, కల్యాణి ప్రియదర్శన్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించారు. వీ.హౌస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేష్‌ కామాక్షి నిర్మించిన ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందించారు. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఎట్టకేలకు ఈ నెల 25వ తేదీ తెరపైకి వచ్చిన మానాడు చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణతో థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చిత్ర దర్శక నిర్మాతలను తన ఇంటికి పిలిపించుకొని అభినందించడం విశేషం. ఈ విషయాన్ని నిర్మాత సురేష్‌ కామాక్షి ట్విట్టర్లో పేర్కొంటూ ‘సూపర్‌ స్టార్‌ ఆహ్వానం, అభినందనలు ఈ చిత్ర విజయాన్ని దృవపరిచాయి. మంచిని వెతికి అభినందించే ఈ మనసే ఇంకా మిమ్మల్ని ఉన్నత సింహాసనంపై కూర్చోబెట్టింది. గొప్ప ఫలితాన్ని పొందాం. యూనిట్‌ సభ్యులందరి తరఫునా ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement