తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ధనుష్ టాలీవుడ్‌లో డెబ్యూ ఇచ్చారు. .రిలీజ్‌కు ముందే ఈ సినిమా పాటలు మాంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక సార్ విడుదలైన తొలిరోజే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.విద్యావ్యవస్థపై ఓ లెక్చరర్ పోరాటం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
కలెక్షన్స్ విషయంలోనూ సార్ దూసుకుపోతుంది. తాజాగా హైదరాబాద్‌లో మూవీ టీం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ.. యాంకర్ స్రవంతి చొక్కారపుపై సీరియస్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సార్ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టుల గురించి మాట్లాడిన ఆయన చివర్లో హైపర్ ఆది గురించి మాట్లాడటం మర్చిపోయారు.
దీంతో మళ్లీ మైక్ తీసుకొని అతని గురించి మాట్లాడుతుండగా అది గమనించని యాంకర్.. స్టేజ్‌పై మరో గెస్ట్‌ను పిలిచింది. దీంతో కోప్పడిన ఆయన ‘ఏ పిల్లా ఆపు.. ఏ అమ్మాయ్ టైరో టైరో. స్టేజ్ మీద ఎవరు మాట్లాడుతున్నా కాసేపు ఆగండి. మాట్లాడిన తర్వాత పిలవండి. సభ్యతతో ఉండండి. ప్లీజ్’.. అంటూ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment