ప్రసాద్, రేణుక
ప్రసాద్ రెడ్డి, రేణుక జంటగా కళా రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆ నిమిషం’. వెంకటేశ్వర డిజిటల్ మూవీస్ పతాకంపై బండారు హరితేజ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో కళా రాజేష్ మాట్లాడుతూ– ‘‘ఆడపిల్లలను రక్షించండి– సంరక్షించండి’ అనే ప్రధాన పాయింట్ చుట్టూ తెరకెక్కించిన చిత్రమిది. 44మంది నూతన నటీనటులతో, కొత్త సాంకేతిక నిపుణులతో నిర్మించిన మా చిన్న బడ్జెట్ చిత్రాన్ని ఆదరించి, ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు.
‘‘ఈ సినిమా తీయడం వెనక ఉన్న మా ఉద్దేశం ప్రేక్షకాదరణతో సఫలమైంది’’ అన్నారు ప్రసాద్‌రెడ్డి. ‘‘లెక్చరర్స్ అయిన మేము నిర్మించిన ఈ చిత్రాన్ని సెన్సార్ అధికారుల నుంచి ఎందరో పెద్దలు ఆశీర్వదించినందుకు థ్యాంక్స్. మా సినిమాని ప్రోత్సహించిన డైరెక్టర్ జి.నాగేశ్వర రెడ్డి, నటి జయసుధ, ఎమ్మెల్యే రోజా, హీరో శ్రీకాంత్‌గార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్‌కె నజీర్. రేణుక, కో డైరెక్టర్ రాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment