రోహీ, ప్రసాద రెడ్డి
నేటి సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, భ్రూణ హత్యల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఆ నిమిషం’. ప్రసాద రెడ్డి, రాణిశ్రీ, రేణుక, నాగబాబు, శ్రీదేవి, శరభారావు, బేబీ రోహీ, బేబీ నన్న ముఖ్య తారలుగా కళా రాజేష్ దర్శకత్వంలో వెంకటేశ్వర డిజిటల్ మూవీస్ బ్యానర్‌పై బండారు హరితేజ నిర్మించారు. గురువారం నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులతో ‘మన సమాజంలో ఆడ పిల్లల స్థాయి పెంచాలి’ అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు టీమ్. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించారు.
ఆడపిల్లలకు సమాజంలో సమున్నత స్థాయిని కల్పించి వాళ్లను గౌరవించాలి, ప్రోత్సహించాలి అని విద్యార్థులు ఏకకంఠంతో కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపింది చిత్రబృందం. ‘‘ప్రతి ఒక్కరూ దేవుడిచ్చిన ఆడపిల్లలను స్వాగతించాలి. అపురూపంగా పెంచాలి. సుస్థిరమైన జీవితం అందించాలి. ఇందుకు మగవారు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి. ఈ సందేశాన్నే మా సినిమాలో చూపించాం’’ అని కళా రాజేష్ అన్నారు. ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment