థియేటర్స్‌లో దుమ్మురేపుతున్న మట్టి కుస్తీ.. రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు | Vishnu Vishal Matti Kusthi Collections Crosses Rs 30 Crore Says Producer | Sakshi
Sakshi News home page

Matti Kusthi Collections : మట్టి కుస్తీ :  రూ. 30 కోట్ల వసూళ్లతో థియేరట్స్‌లో రచ్చ

Published Fri, Dec 9 2022 9:19 AM | Last Updated on Fri, Dec 9 2022 9:25 AM

Vishnu Vishal Matti Kusthi Collections Crosses Rs 30 Crore Says Producer - Sakshi

తమిళసినిమా: నటుడు విష్ణు విశాల్‌ కథానాయకుడిగా నటించి తన విష్ణు విశాల్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై టాలీవుడ్‌ నటుడు రవితేజతో కలిసి నిర్మించిన చిత్రం కట్టా కుస్తీ. మలయాళ కుట్టి ఐశ్వర్య లక్ష్మి నాయకిగా నటించిన ఈ చిత్రానికి సెల్లా అయ్యావు కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఈ చిత్రం విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ పొందటం విశేషం.

ఇటీవల విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. దీంతో చిత్ర యూనిట్‌ బుధవారం మధ్యాహ్నం చెన్నై వడపళనిలోని ఓ హోటల్లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది.నటి ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ కట్టా కుస్తీ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్‌ రిపోర్ట్‌ రావడం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇది టీం వర్కుతో రూపొందిన చిత్రమని పేర్కొన్నారు. ఇందులో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఆయన నిర్మించడం వల్లనే ఈ విజయం సాధ్యమైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

నటుడు కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ దీనిని తన సెకండ్‌ ఇన్నింగ్స్‌గా భావిస్తున్నారన్నారు. ఈ చిత్ర టీం తనకు చాలా స్పెషల్‌ అని పేర్కొన్నారు.దర్శకుడు చెప్పిన చిత్రంలోని ఆడ మగ సమానం అనే థాట్‌ నచ్చడంతో చిత్రాన్ని చేయడానికి ముందుకు వచ్చానని చెప్పారు. తన విజయానికి అమ్మ, అక్క, తన భార్య కారణమన్నారు. వారంతా తనకు చాలా సపోర్టుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. తానే కాదు ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్నది నిజమన్నారు. నిర్మాతగా మారడానికి కారణం నటుడిగా తన కలలను నిజం చేసుకోవడానికే అని చెప్పారు.

కట్టా కుస్తీ చిత్ర తొలి ఆటను తాను మదురైలో ప్రేక్షకుల మధ్య చూశానని, థియేటర్లో మహిళల ఆదరణను చూసి చాలా సంతోషం కలిగిందన్నారు. ఈ చిత్రం ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా వసూలు చేసిందని, ఇంకా వసూలు చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. మంచి అనుభూతినిచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement