‘‘తెలుగు సినిమాలకు గొప్ప ఆదరణ లభిస్తోంది. ఇండియాలో టాలీవుడ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా ఎదిగింది. తెలుగు ప్రేక్షకులకు సినిమాలపై ఉన్న ప్రేమాభిమానాలే ఇందుకు కారణం’’ అన్నారు హీరోయిన్ ఐశ్వర్యా లక్ష్మీ. విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మి జంటగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మట్టి కుస్తీ’. విష్ణు విశాల్‌తో కలిసి రవితేజ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 2న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా ఐశ్వర్యా లక్ష్మీ మాట్లాడుతూ– ‘‘మూడేళ్ల క్రితమే ‘మట్టి కుస్తీ’ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది. అయితే హీరోయిన్ పాత్ర సవాల్‌తో కూడుకున్నది. అందుకే ఓకే చెప్పలేదు. కానీ ఆశ్చర్యకరంగా మళ్లీ ఈ కథ నా వద్దకే వచ్చింది. ఈ గ్యాప్‌లో కొన్ని సినిమాలు చేసి, ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాను. దాంతో ఈసారి ఓకే చెప్పాను. ఈ సినిమా ఎందుకు సవాల్‌గా అనిపించిందంటే నాకు టఫ్‌గా అనిపించే కామెడీని డీల్ చేయాల్సి వచ్చింది. ఇగో, వినోదం, ఎమోషన్స్ అన్నీ ఉన్న ఫ్యామిలీ డ్రామా ‘మట్టి కుస్తీ’. ఇక కథల ఎంపికలో నాకు తొందరలేదు. ప్రేక్షకులు నన్ను గుర్తు పెట్టుకునే పాత్రలే చేయాలనుకుంటున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment