Matti Kusthi Movie
-
ఓటీటీకి 'మట్టి కుస్తీ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నటుడు విష్ణు విశాల్, ఐశ్యర్య లక్ష్మీ జంటగా నటించిన చిత్రం మట్టి కుస్తీ. విష్ణు విశాల్ ప్రొడక్షన్స్ పతాకంపై టాలీవుడ్ నటుడు రవితేజతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. నూతన సంవత్సర కానుకగా జనవరి ఒకటో తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. (ఇది చదవండి: Matti Kusthi Review: ‘మట్టి కుస్తీ’మూవీ రివ్యూ) కథేంటంటే.. కేరళకు చెందిని కీర్తి(ఐశ్యర్య లక్ష్మీ)కి రెజ్లింగ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఇష్టం లేకపోయినా.. బాబాయ్ సపోర్ట్‌తో కుస్తీ పోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయిలో ఛాంపియన్‌గా నిలుస్తుంది. అయితే ఆడపిల్ల రెజ్లర్ అని తెలిస్తే ఎవరూ పెళ్లి చేసుకోరని పేరెంట్స్ భయపడతారు. ఆటను వదిలేసి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తారు. ఈ టెన్షన్‌తో నాన్నకు గుండెపోటు వస్తుంది. దీంతో ఫ్యామిలీ కోసం కీర్తి పెళ్లికి ఓకే చెబుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీర(విష్ణు విశాల్) ఊర్లో ఓ పెద్ద ఆసామీ. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో మామయ్య(కరుణాస్) పెంచి పెద్ద చేస్తాడు. వీర ఎలాంటి లక్ష్యం లేకుండా ఊర్లో బలాదూర్‌గా తిరుగుతుంటాడు. వయసు పెరిగిపోతుండటంతో పెళ్లిచేయాలనుకుంటారు. తను పెళ్లి చేసుకునే అమ్మాయి పెద్దగా చదువుకోవద్దని, తన చెప్పుచేతల్లో ఉండాలని కండీషన్స్ పెట్టుకుంటాడు వీర. తనకంటే ఎక్కువగా చదువుకుందని చాలా సంబంధాలను రిజెక్ట్ చేస్తుంటాడు. మరోవైపు రెజ్లర్ అయిన కారణంగా కీర్తిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఈ నేపథ్యంలో కీర్తి బాబాయ్‌కి ఓ ఐడియా వస్తుంది. కీర్తికి ఏడో తరగతి వరకే చదువుకుందని, పెద్ద జడ ఉందని అబద్దం చెప్పి వీరాతో పెళ్లి చేస్తాడు. కానీ వీరాకు ఓ రోజు కీర్తి ఓ రెజ్లర్ అనే నిజం తెలుస్తుంది. అలాగే ఆమెకు పెద్ద జడలేదని, అది విగ్ అని వెలుస్తుంది. ఆ తర్వాత వీర పరిస్థితి ఏంటి? నిజం తెలిసిన తర్వాత వీర, కీర్తిల మధ్య ఎలాంటి గొడవలు ఏర్పడ్డాయి? కుస్తీ పోటీలో భార్యతో వీర ఎందుకు పోటీ పడ్డాడు? విడాకుల వరకు వెళ్లిన వీరిద్దరు మళ్లీ ఎలా కలిశారు? అనేదే మిగతా కథ. -
థియేటర్స్‌లో దుమ్మురేపుతున్న మట్టి కుస్తీ.. రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు
తమిళసినిమా: నటుడు విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించి తన విష్ణు విశాల్ ప్రొడక్షన్స్ పతాకంపై టాలీవుడ్ నటుడు రవితేజతో కలిసి నిర్మించిన చిత్రం కట్టా కుస్తీ. మలయాళ కుట్టి ఐశ్వర్య లక్ష్మి నాయకిగా నటించిన ఈ చిత్రానికి సెల్లా అయ్యావు కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఈ చిత్రం విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందటం విశేషం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. దీంతో చిత్ర యూనిట్ బుధవారం మధ్యాహ్నం చెన్నై వడపళనిలోని ఓ హోటల్లో సక్సెస్ మీట్ నిర్వహించింది.నటి ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ కట్టా కుస్తీ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ రిపోర్ట్ రావడం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇది టీం వర్కుతో రూపొందిన చిత్రమని పేర్కొన్నారు. ఇందులో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఆయన నిర్మించడం వల్లనే ఈ విజయం సాధ్యమైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నటుడు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ దీనిని తన సెకండ్ ఇన్నింగ్స్‌గా భావిస్తున్నారన్నారు. ఈ చిత్ర టీం తనకు చాలా స్పెషల్ అని పేర్కొన్నారు.దర్శకుడు చెప్పిన చిత్రంలోని ఆడ మగ సమానం అనే థాట్ నచ్చడంతో చిత్రాన్ని చేయడానికి ముందుకు వచ్చానని చెప్పారు. తన విజయానికి అమ్మ, అక్క, తన భార్య కారణమన్నారు. వారంతా తనకు చాలా సపోర్టుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. తానే కాదు ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్నది నిజమన్నారు. నిర్మాతగా మారడానికి కారణం నటుడిగా తన కలలను నిజం చేసుకోవడానికే అని చెప్పారు. కట్టా కుస్తీ చిత్ర తొలి ఆటను తాను మదురైలో ప్రేక్షకుల మధ్య చూశానని, థియేటర్లో మహిళల ఆదరణను చూసి చాలా సంతోషం కలిగిందన్నారు. ఈ చిత్రం ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా వసూలు చేసిందని, ఇంకా వసూలు చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. మంచి అనుభూతినిచ్చింది. -
నాకు ఇష్టమైన నటుడితో నటించే అవకాశం వచ్చింది : హీరోయిన్
తమిళసినిమా: మాలీవుడ్, కోలీవుడ్‌లలో నటిస్తూ బిజీగా ఉన్న నటి ఐశ్వర్య లక్ష్మి. గార్గి చిత్రంతో నిర్మాతగానూ మారిన ఈ మలయాళి బ్యూటీ కోలీవుడ్‌లో విశాల్ హీరోగా నటించిన యాక్షన్ చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. ఆ తరువాత ధనుష్ జంటగా జగమే తందిరం చిత్రంలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా విష్ణు విశాల్‌కు జంటగా కట్టా కుస్తీ త్రంలో నటింంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలో ఈమె నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించింది. కుస్తీ పోటీల్లో తన నటనకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేసింది. తనకు మలయాళ సపర్‌స్టార్ మమ్ముట్టీ అంటే చాలా ఇష్టమన్నారు. ఆయన నటనను చూస్తూ పెరిగినట్లు పేర్కొంది. అలాంటిది ఇప్పుడు ఆయన కథానాయకుడిగా నటిస్తున్న క్రిస్టోఫర్ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా తాను నటించడం మరిపోలేని అనుభవమని తెలిపింది. మరో విషయం ఏమిటంటే నటుడు దుల్కర్ సల్మాన్‌కు జంటగా కింగ్ ఆఫ్ గోదా చిత్రంలో కథానాయకిగా నటిస్తున్నట్లు పేర్కొంది. ఇలా ఒకేసారి తండ్రీకొడుకులతో నటించడం అరుదైన అనుభవంగా పేర్కొంది. ఈ ఏడాది తాను జీవితంలో గుర్తుండిపోయిందని సంతోషం వ్యక్తం చేసింది. -
మట్టికుస్తీ: అలాంటి అమ్మాయి భార్యగా రావాలనుకుంటాడు.. కానీ
నటుడు విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించి తన విష్ణువిశాల్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం మట్టికుస్తీ. మలయాళ బ్యూటీ ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలోనటుడు కరుణాస్, మీనీష్ కాంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. చెల్లాఅయ్యావు కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహింన ఈ చిత్రం కుస్తీ నేపథ్యంలో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కింది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుబంధం గురించి చర్చించే చిత్రంగా ఇది ఉంటుంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన విష్ణువిశాల్ తనకు కాబోయే భార్య ఎలా ఉండాలి అన్న విషయంలో ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో ఉంటాడు. తనకంటే తక్కువ చదివిన విష్ణువిశాల్ తనకు కాబోయే భార్య ఎలా ఉండాలి అన్న విషయంలో ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో ఉంటాడు. తనకంటే తక్కువ చదివిన అమ్మాయిగా ఉండాలి. తన మాటకు ఎదురు చెప్పకూడదు. ముఖ్యంగా పొడవైన కురులు కలిగి ఉండాలి. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని భీష్మించుకొని కూర్చుంటాడు. అయితే తను కోరుకున్న అమ్మాయికి భిన్నంగా జీవిత భాగస్వామి వస్తే జరిగే పరిణామాలు ఏమిటి? అన్నది కట్టాకుస్తీ చిత్రం. ఇందులో 20 ఎకరాల పొలం, బంగ్లా ఉన్నా.. బాధ్యతలు తెలియని యువకుడిగా నటుడు విష్ణువిశాల్ నటించారు. ఐశ్వర్యలక్ష్మి కుస్తీ క్రీడపై ఆసక్తితో ఆ రంగంలో పేరు తెచ్చుకున్న యువతిగా నటించారు. నటుడు విష్ణువిశాల్ కూడా కబడ్డీ క్రీడలు పరిచయం ఉన్న క్రీడాకారుడు. అలాంటి వీరిద్దరికీ ఎలా పెళ్లి జరిగింది. ఇద్దరు కుస్తీ పోటీల బరిలోకి దిగడానికి కారణాలేమిటి? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం కట్టా కుస్తీ. భార్యాభర్తల మధ్య ఈగో అనేదానికి తావు లేకుండా ఒకరికొకరు గౌరవించుకోవాలి, భార్య ఇష్టాఇష్టాలు భర్త గుర్తెరిగి ప్రోత్సహించాలి అనే సందేశంతో కూడిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. -
Matti Kusthi Review: ‘మట్టి కుస్తీ’మూవీ రివ్యూ
టైటిల్: మట్టి కుస్తీ నటీనటులు: విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, శ్రీజ రవి తదితరులు నిర్మాణ సంస్థలు: ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మాతలు: రవితేజ, విష్ణు విశాల్ దర్శకత్వం: చెల్లా అయ్యావు సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం నాథన్ ఎడిటర్: ప్రసన్న జికె విడుదల తేది: డిసెంబర్ 2, 2022 మాస్ మహారాజా రవితేజ నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం ‘మట్టి కుస్తీ’(తమిళంలో-గట్టా కుస్తీ). విష్ణు విశాల్ హీరో. ఆయనకు జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటించింది. ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పుడు ఇది స్పోర్ట్స్ డ్రామా కావొచ్చని అంతా భావించారు. కానీ ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చిత్ర యూనిట్ చెప్పడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘మట్టి కుస్తీ’పై ఆసక్తి పెరిగింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(డిసెంబర్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కేరళకు చెందిని కీర్తి(ఐశ్యర్య లక్ష్మీ)కి రెజ్లింగ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఇష్టం లేకపోయినా.. బాబాయ్ సపోర్ట్‌తో కుస్తీ పోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయిలో ఛాంపియన్‌గా నిలుస్తుంది. అయితే ఆడపిల్ల రెజ్లర్ అని తెలిస్తే ఎవరూ పెళ్లి చేసుకోరని పేరెంట్స్ భయపడతారు. ఆటను వదిలేసి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తారు. ఈ టెన్షన్‌తో నాన్నకు గుండెపోటు వస్తుంది. దీంతో ఫ్యామిలీ కోసం కీర్తి పెళ్లికి ఓకే చెబుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీర(విష్ణు విశాల్) ఊర్లో ఓ పెద్ద ఆసామీ. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో మామయ్య(కరుణాస్) పెంచి పెద్ద చేస్తాడు. వీర ఎలాంటి లక్ష్యం లేకుండా ఊర్లో బలాదూర్‌గా తిరుగుతుంటాడు. వయసు పెరిగిపోతుండటంతో పెళ్లిచేయాలనుకుంటారు. తను పెళ్లి చేసుకునే అమ్మాయి పెద్దగా చదువుకోవద్దని, తన చెప్పుచేతల్లో ఉండాలని కండీషన్స్ పెట్టుకుంటాడు వీర. తనకంటే ఎక్కువగా చదువుకుందని చాలా సంబంధాలను రిజెక్ట్ చేస్తుంటాడు. మరోవైపు రెజ్లర్ అయిన కారణంగా కీర్తిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఈ నేపథ్యంలో కీర్తి బాబాయ్‌కి ఓ ఐడియా వస్తుంది. కీర్తికి ఏడో తరగతి వరకే చదువుకుందని, పెద్ద జడ ఉందని అబద్దం చెప్పి వీరాతో పెళ్లి చేస్తాడు. కానీ వీరాకు ఓ రోజు కీర్తి ఓ రెజ్లర్ అనే నిజం తెలుస్తుంది. అలాగే ఆమెకు పెద్ద జడలేదని, అది విగ్ అని వెలుస్తుంది. ఆ తర్వాత వీర పరిస్థితి ఏంటి? నిజం తెలిసిన తర్వాత వీర, కీర్తిల మధ్య ఎలాంటి గొడవలు ఏర్పడ్డాయి? కుస్తీ పోటీలో భార్యతో వీర ఎందుకు పోటీ పడ్డాడు? విడాకుల వరకు వెళ్లిన వీరిద్దరు మళ్లీ ఎలా కలిశారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. లింగ బేధం లేదని ఎంత చెప్పినా కూడా ఇప్పటికీ చాలా చోట్ల స్త్రీలకు సరైన గౌరవం ఉండడం లేదు. వాళ్లను చిన్న చూపుగా చూసేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. ముఖ్యంగా భార్యల విషయంలో చాలా మంది భర్తలు చులకనగా వ్యవహరిస్తారు. తన ఇష్టాలను ఆమె గౌరవించాలి కానీ.. భార్య ఇష్టాయిష్టాలతో తనకు సంబంధం లేదనే భర్తలు ఇప్పటికీ ఉన్నారు. అది తప్పని, భార్య ఇష్టాయిష్టాలను కూడా భర్తలు గౌరవించాలని చాటి చెప్పే చిత్రమే ‘మట్టి కుస్తీ’. ఓ మంచి సందేశాన్ని కామెడీ వేలో ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు చెల్ల అయ్యావు సఫలం అయ్యాడు. టైటిల్ చూస్తే ఇదేదో స్పోర్ట్స్ డ్రామా అనుకుంటాం. కానీ ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. కొత్తగా పెళ్లైన భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్థలు, గొడవల నేపథ్యంలో కథనం సాగుతుంది. ఈ నేపథ్యంతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఫ్యామిలీ డ్రామాకి, స్పోర్ట్స్ యాంగిల్‌ని మేళవించడం ‘మట్టి కుస్తీ’ స్పెషల్. సినిమా అంతా కామెడీ కామెడీగా సాగుతుంది. తను అనుకున్నట్లుగా భార్య పెద్దగా చదువుకోలేదని, పెద్ద జడ ఉందని భావించే హీరో.. రెజ్లర్ అన్న విషయం భర్తకు తెలియకుండా మ్యానేన్ చేసే క్రమంలో హీరోయిన్ పడే ఇబ్బందులతో ఫస్టాఫ్ అంతా ఫన్‌గా సాగుతుంది. కథంతా ఊహకందేలా సాగుతున్నా.. ఎక్కడా బోర్ కొట్టదు. ఇంటర్వెల్ ముందు హీరోయిన్ చేసే ఫైట్ సీన్ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ రెజ్లర్ అనే విషయం హీరోకి తెలియడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో హీరో పరిస్థితి రివర్స్ అవుతుంది. ఊరి జనాలంతా తన కంటే భార్యకే ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం.. అందరి ముందు తన పరువు తీసిందని భార్యపై కోపం పెంచుకోవడం.. ఈ క్రమంలో హీరో చేసే పనులు థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తాయి. అయితే భార్య భర్తల ఇగో క్లాషెస్‌ని కామెడీగా చూపిస్తూనే ఎమోషనల్ యాంగిల్‌ని టచ్ చేశాడు దర్శకుడు. భార్యలు ఎప్పుడూ తమ చెప్పుచేతుల్లోనే ఉండాలనే భర్తల ఆలోచన తప్పనే విషయాన్ని వినోదాత్మకంగా చూపించాడు. ఎవరెలా చేశారంటే.. హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు విష్ణు విశాల్. కొత్తదనం ఉన్న కథలను ఎంచుకుంటూ కోలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. . `రాక్షసన్` చిత్రంతో అక్కడ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక మరో ప్రయోగంగా మట్టి కుస్తీ చేశాడు. ఇందులో వీర పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. తనదైన కామెడీతో నవ్వించాడు. కీర్తి పాత్రలో ఐశ్యర్యలక్ష్మీ ఒదిగిపోయింది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం. హీరోతో సమానంగా ఆమె పాత్ర సాగుతుంది. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేసింది. వీర మామయ్యగా కరుణాస్, కీర్తి బాబాయ్‌గా మునీష్ కాంత్‌తో పాటు మిగిలన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం బాగుంది. పాటలు తమిళ నెటివిటీకి తగ్గట్లుగా ఉంటాయి. రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
అలాంటి పాత్రలే చేయాలనుకుంటున్నాను: ఐశ్వర్యా లక్ష్మీ
‘‘తెలుగు సినిమాలకు గొప్ప ఆదరణ లభిస్తోంది. ఇండియాలో టాలీవుడ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా ఎదిగింది. తెలుగు ప్రేక్షకులకు సినిమాలపై ఉన్న ప్రేమాభిమానాలే ఇందుకు కారణం’’ అన్నారు హీరోయిన్ ఐశ్వర్యా లక్ష్మీ. విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మి జంటగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మట్టి కుస్తీ’. విష్ణు విశాల్‌తో కలిసి రవితేజ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఐశ్వర్యా లక్ష్మీ మాట్లాడుతూ– ‘‘మూడేళ్ల క్రితమే ‘మట్టి కుస్తీ’ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది. అయితే హీరోయిన్ పాత్ర సవాల్‌తో కూడుకున్నది. అందుకే ఓకే చెప్పలేదు. కానీ ఆశ్చర్యకరంగా మళ్లీ ఈ కథ నా వద్దకే వచ్చింది. ఈ గ్యాప్‌లో కొన్ని సినిమాలు చేసి, ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాను. దాంతో ఈసారి ఓకే చెప్పాను. ఈ సినిమా ఎందుకు సవాల్‌గా అనిపించిందంటే నాకు టఫ్‌గా అనిపించే కామెడీని డీల్ చేయాల్సి వచ్చింది. ఇగో, వినోదం, ఎమోషన్స్ అన్నీ ఉన్న ఫ్యామిలీ డ్రామా ‘మట్టి కుస్తీ’. ఇక కథల ఎంపికలో నాకు తొందరలేదు. ప్రేక్షకులు నన్ను గుర్తు పెట్టుకునే పాత్రలే చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. -
హీరోగా రాలేదు,నిర్మాతగానూ నన్ను ప్రోత్సహించండి – రవితేజ
‘‘మట్టి కుస్తీ’ వేడుకకి నేను హీరోగా రాలేదు.. నేను కూడా ఒక నిర్మాతగా మాట్లాడుతున్నా. ఈ వేడుకకి మీరే(అభిమానులు) ముఖ్య అతిథులు. హీరోగా నన్ను ఎంతో సపోర్ట్ చేశారు.. అలాగే నిర్మాతగానూ ప్రోత్సహించండి’’ అని రవితేజ అన్నారు. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మట్టి కుస్తీ’. హీరో రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్లో రవితేజ మాట్లాడుతూ– ‘‘విష్ణు విశాల్ చాలా పాజిటివ్ పర్సన్. తనని కలిసిన మొదటిసారి ఎన్నాళ్లో పరిచయం ఉన్న వాడిలా అనిపించాడు. సింగిల్ సిట్టింగ్‌లోనే ‘మట్టి కుస్తీ’ చిత్రం ఓకే అయిపోయింది. చెల్లా అయ్యావు ఈ చిత్ర కథ చెప్పినప్పుడు నవ్వి నవ్వి చచ్చాను. తనతో కచ్చితంగా ఓ సినిమా చేయాలి.. చేస్తాను. జస్టిన్ ప్రభాకరణ్తోన పనిచేస్తాను. రిచర్డ్స్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. అందం, ప్రతిభ కలిస్తే ఐశ్వర్య లక్ష్మి. ఇందులో తన పాత్ర చాలా బాగుంటుంది. ఇది కేవలం స్పోర్ట్స్ ఫిలిం మాత్రమే కాదు. లవ్, ఫ్యామిలీ, యాక్షన్, ఎవెషన్.. ఇలా అన్నీ ఉన్నాయి. ‘మట్టి కుస్తీ’ చాలా బాగా వచ్చింది.. కచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘రవితేజగారికి మంచి మానవత్వం, మనసు ఉంది. అలాంటి ఆయనకు అభిమానులైన మీరందరూ లక్కీ’’ అన్నారు విష్ణు విశాల్. ‘‘మట్టి కుస్తీ’ కథ విష్ణు విశాల్‌గారికి బాగా నచ్చింది. ఈ సినిమాని తెలుగులోనూ తీయడానికి కారణం రవితేజసర్ ఇచ్చిన ప్రోత్సాహమే.. ఆయనకు రుణపడి ఉంటాను’’ అన్నారు చెల్లా అయ్యావు. ‘‘విష్ణుపై నమ్మకంతో ఒక్క మీటింగ్‌లోనే ఈ సినివను నేను నిర్మిస్తానని చెప్పారు రవితేజగారు.. అలా చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి’’ అన్నారు బ్యాడ్మింటన్ స్టార్, విషు విశాల్ సతీమణి గుత్తా జ్వాల. ఈ వేడుకలో డైరెక్టర్స్ సుధీర్ వర్మ, వంశీ, ఐశ్వర్య లక్ష్మి, సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరణ్, కెమెరామేన్ రిచర్డ్ ఎం.నాథన్, రచయితలు రాకేందు మౌళి, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
మట్టి కుస్తీ మూవీ టీంతో " స్పెషల్ చిట్ చాట్ "
-
తెలుగింటి అల్లుడిని.. మంచి కంటెంట్ ఉన్న ‘మట్టి కుస్తీ’ తో వచ్చా: విష్ణు విశాల్
కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్ హీరో గా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ’. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ‘ఆర్ టీ టీమ్ వర్క్స్’, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్స్ పై మాస్ మహారాజా రవితేజ తో కలిసి విష్ణు విశాల్ నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రముఖ ఏ ఎం బీ మాల్ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ కోసం నిర్వహించిన ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో హీరో విష్ణు విశాల్, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి పాల్గొని సందడి చేశారు. సినిమాలోని పాటకు స్టెప్పులేసి అభిమానులను అలరించారు. అనంతరం విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ‘నేను జ్వాలా గుత్తాను పెళ్లి చేసుకున్న విషయం మీకు తెలిసిందే. నేను తెలుగింటి అల్లుడిని. నేను జ్వాలాని పెళ్లి చేసుకున్నాక తెలుగు సినిమాలు చేయమని జ్వాలా నన్ను హైదరాబాద్ కు తీసుకొచ్చింది. నా కెరీర్ లో అతిపెద్ద సినిమా ‘మట్టి కుస్తీ’తో ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను. ఇందుకు కారణమైన జ్వాలాకు, నన్ను నమ్మి సినిమాను నిర్మించిన రవితేజ సర్ కు ధన్యవాదాలు. రాక్షసన్, అరణ్య, ఎఫ్ఐఆర్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు నేను తెలుసు. ఇప్పుడు మట్టి కుస్తీతో మీ ముందుకు వస్తున్నా. ఎంటర్ టైన్ మెంట్, కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఆదరిస్తారు. మా మట్టి కుస్తీ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి కంటెంట్ ఉంది. ఏ హీరో, ఏ భాష అనేది చూడకుండా కంటెంట్ ను మాత్రమే చూసి ఆదరించే తెలుగు ప్రేక్షకులపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఈ సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంది. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నా’ అన్నారు. ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. ‘నేను చేసిన ‘అమ్ము’, ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. అలాగే ఈ ‘మట్టి కుస్తీ’ సినిమాను కూడా థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. రవితేజ సర్ విష్ణు విశాల్ సర్ ను నమ్మి ఖర్చుకు వెనకాడకుండా ఎంతో గ్రాండియర్ గా ఈ సినిమాను నిర్మించారు. రవితేజ గారి వల్లే నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చా. డిసెంబర్ 2న థియేటర్లలో మా సినిమాను చూసి ఆదరించండి’ అన్నారు.