నటుడు విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించి తన విష్ణువిశాల్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం మట్టికుస్తీ. మలయాళ బ్యూటీ ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలోనటుడు కరుణాస్, మీనీష్ కాంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. చెల్లాఅయ్యావు కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహింన ఈ చిత్రం కుస్తీ నేపథ్యంలో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కింది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుబంధం గురించి చర్చించే చిత్రంగా ఇది ఉంటుంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన విష్ణువిశాల్ తనకు కాబోయే భార్య ఎలా ఉండాలి అన్న విషయంలో ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో ఉంటాడు.
తనకంటే తక్కువ చదివిన విష్ణువిశాల్ తనకు కాబోయే భార్య ఎలా ఉండాలి అన్న విషయంలో ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో ఉంటాడు. తనకంటే తక్కువ చదివిన అమ్మాయిగా ఉండాలి. తన మాటకు ఎదురు చెప్పకూడదు. ముఖ్యంగా పొడవైన కురులు కలిగి ఉండాలి. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని భీష్మించుకొని కూర్చుంటాడు. అయితే తను కోరుకున్న అమ్మాయికి భిన్నంగా జీవిత భాగస్వామి వస్తే జరిగే పరిణామాలు ఏమిటి? అన్నది కట్టాకుస్తీ చిత్రం.
ఇందులో 20 ఎకరాల పొలం, బంగ్లా ఉన్నా.. బాధ్యతలు తెలియని యువకుడిగా నటుడు విష్ణువిశాల్ నటించారు. ఐశ్వర్యలక్ష్మి కుస్తీ క్రీడపై ఆసక్తితో ఆ రంగంలో పేరు తెచ్చుకున్న యువతిగా నటించారు. నటుడు విష్ణువిశాల్ కూడా కబడ్డీ క్రీడలు పరిచయం ఉన్న క్రీడాకారుడు. అలాంటి వీరిద్దరికీ ఎలా పెళ్లి జరిగింది. ఇద్దరు కుస్తీ పోటీల బరిలోకి దిగడానికి కారణాలేమిటి? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం కట్టా కుస్తీ. భార్యాభర్తల మధ్య ఈగో అనేదానికి తావు లేకుండా ఒకరికొకరు గౌరవించుకోవాలి, భార్య ఇష్టాఇష్టాలు భర్త గుర్తెరిగి ప్రోత్సహించాలి అనే సందేశంతో కూడిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment