Jennifer Emmanuel
-
ప్రేక్షకులు మరోసారి నిరూపించారు
‘‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’ వంటి చిన్న సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా మూవీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందని, చివరి పది నిమిషాలు కట్టిపడేశావు అని ఆడియన్స్ అంటున్నారు. థియేటర్లో ఎంజాయ్ చేయాల్సిన మూవీ ఇది. ఆ థ్రిల్, ఫీలింగ్ ఓటీటీలో చూస్తే రావు’’ అని చిత్ర దర్శకుడు గురు పవన్ అన్నారు. ఉదయ్ శంకర్, జెన్నీఫర్ జంటగా నటించిన చిత్రం ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’. అట్లూరి ఆర్. సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం విజయోత్సవంలో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘కంటెంట్ బాగుంటే చిన్న చిత్రమైనా ఆదరిస్తామని మా మూవీతో ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. సినిమా విడుదలైన అన్ని చోట్ల షోలు పెంచుతున్నారు’’ అన్నారు. ‘‘వైవిధ్యమైన కథ, కథనాలతో సినిమా తీశారనే మంచి పేరు వచ్చింది’’ అన్నారు అట్లూరి నారాయణ రావు. ‘‘తెలుగులో నా తొలి చిత్రమిది’’ అన్నారు జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్. -
ఆ సీన్ కోసం తక్కువ తిన్నా: హీరోయిన్
ఉదయ్ శంకర్, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ జంటగా గురుపవన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’. ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో జెన్నిఫర్ మాట్లాడుతూ – ‘‘నా స్వస్థలం ముంబై. ఇంగ్లీష్ లిటరేచర్‌లో మాస్టర్స్ చేసిన తర్వాత జర్నలిజంలో డి΄÷్లమా కోర్సు చేశాను. ఆ తర్వాత యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. వెస్ట్రన్ డాన్సులతో ΄ాటు భరత నాట్యం వంటి సంప్రదాయ నృత్యాలు నేర్చుకున్నాను. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో నాకు ‘బాయ్స్ విల్ బీ బాయ్స్’ అనే తెలుగు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. అయితే సినిమాటోగ్రాఫర్‌గా చేసిన మనోహర్‌గారు ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’కు నన్ను ప్రిఫర్ చేశారు. ఈ చిత్రంలో రెండు షేడ్స్ ఉన్న సంధ్య అనే పాత్ర చేశాను. కొన్ని సన్నివేశాల కోసం బికినీ ధరించాను. అయితే దర్శకుడు నన్ను అందంగా చూపించారు కానీ అసభ్యంగా చూపించలేదు. అలాగే ఓ సీన్ కోసం రెండు రోజులు చాలా తక్కువ ఫుడ్ తీసుకున్నాను. దర్శకులు గురు పవన్‌గారికి కథ పట్ల మంచి క్లారిటీ ఉంది. తెలుగులో నాకు నచ్చిన హీరో ఎన్టీఆర్, హీరోయిన్స్‌లో సమంత అంటే ఇష్టం’’ అని అన్నారు.