‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’అంటున్న ఉదయ్‌ శంకర్‌ | Nachindi Girl Friendu Movie Motion Poster Out | Sakshi
Sakshi News home page

Nachindi Girl Friendu: ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’అంటున్న ఉదయ్‌ శంకర్‌

Published Sat, Apr 2 2022 3:40 PM | Last Updated on Sat, Apr 2 2022 3:40 PM

Nachindi Girl Friendu Movie Motion Poster Out - Sakshi

గురు పవన్ దర్శకత్వంలో యంగ్‌ హీరో ఉదయ్‌ కిరణ్‌ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో జెన్నీ హీరోయిన్‌గా నటిస్తుండగా, మధునందన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ఈ మూవీ టైటిల్‌ని రివీల్‌ చేసింది చిత్రబృందం. కమర్షియల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ’అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ ఓ పోస్టర్‌ని వదిలారు.

అందులో హీరోయిన్ కు రోజ్ ఫ్లవర్ ఇస్తూ లవ్ ప్రపోజ్ చేస్తున్న హీరోని  వద్దని వారిస్తున్నాడు అతని స్నేహితుడు.  ఈ పోస్టర్ తో హీరో క్యారెక్టరైజేషన్ ఏంటనే ఆసక్తి కలుగుతోంది. సీనియర్ హీరో సుమన్, పృధ్వీరాజ్ , శ్రీకాంత్ అయ్యాంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో  నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాలో అందమైన ప్రేమకథ చుట్టూ జరిగే థ్రిల్లింగ్ అంశాలను చాలా కమర్షియల్ వేలో చూపించబోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement