
ఇటీవల క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన కనా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నటి ఐశ్వర్య రాజేష్. తమిళ హీరో శివ కార్తికేయన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ మరో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాకు ఓకె చెప్పారు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాకు నిర్మల్ కుమార్ దర్శకుడు.
ఆటగదరా శివ ఫేం ఉదయ్ శంకర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య మహిళా వస్తాదుగా కనిపించనున్నారట. ఈ సినిమాలో ఐశ్వర్య తండ్రి పాత్రలో ప్రముఖ విలన్ ప్రదీప్ రావత్ కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ భామ విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో పాటు మరో 10 సినిమాల్లో నటిస్తున్నారు.
కనా సినిమాలో ఐశ్వర్యా రాజేష్
Comments
Please login to add a commentAdd a comment